Sleeping Tips :
మనిషికి తిండి ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే. రోజు కనీసం 7-8 గంటలు నిద్రపోకపోతే మన శరీరం రోగాల బారిన పడుతుంది. శరీరానికి తగిన విశ్రాంతినిచ్చేది నిద్రే. నిద్రపోయే సమయంలో మన అవయవాలు అన్ని విశ్రాంతి తీసుకుంటాయి. దీంతో తెల్లవారి లేవడంతో మనకు హుషారు ఉంటుంది. పనులు చేసుకోవడం సులభమవుతుంది. అదే మనం రాత్రంతా నిద్రపోకపోతే ఉదయం లేవడానికి కూడా శక్తి ఉండదు. నిద్రకు అంత ప్రాధాన్యం ఉంటుంది. అందుకే మనం నిద్రను నిర్లక్ష్యం చేయొద్దు.
రాత్రి బాగా సమయం మెలకువతో ఉండొద్దు. అలా ఉంటే మన రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. ఫలితంగా మనం వ్యాధుల బారిన పడుతుంటాం. దీంతో నిద్రపోవడానికి అనువైన పరిస్థితులు కల్పించుకోవాలి. రోజు సరైన సమయంలోనే నిద్రపోయేందుకు చొరవ తీసుకోవాలి. పడుకునే ముందు గ్లాసు పాలు తాగితే నిద్ర త్వరగా వస్తుంది. దీంతో మంచి నిద్రపడుతుంది.
రాత్రి మనం తీసుకునే భోజనంలో అన్నం కాకుండా పండ్లు, పళ్ల రసాలు తాగితే చాలా మంచిది. తేలికపాటి ఆహారాలు తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది. పడుకునే ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే కూడా మంచి ఫలితాలు వస్తాయి. టీవీ, ల్యాప్ టాప్, స్మార్ట్ ఫోన్లకు దూరంగా ఉండటమే శ్రేయస్కరం. వీటి వాడకం వల్ల నిద్ర అసలు పట్టదు. దీంతో మన ఆరోగ్యం చెడిపోతుంది.
బెడ్ రూంలో వెలుతురు ఉండకుండా చూసుకుంటే నిద్ర సరిగా పడుతుంది. పడక గదిలో ప్రశాంతంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. చీకటిగా ఉంటేనే కళ్లపై వెలుతురు పడకుండా ఉండి మనకు నిద్ర పట్టేందుకు కారణమవుతుంది. ఇలా జాగ్రత్తలు తీసుకుని మంచి నిద్ర పోయేందుకు అవకాశాలు కల్పించుకోవాలి. లేకపోతే రోగాల బారిన పడి మన ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది. సో రోజు కనీసం 7-8 గంటలైనా నిద్రపోయేందుకు అనువైన పరిస్థితులు కల్పించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.