
summer sex : వేసవి కాలంలో శృంగారంలో పాల్గొనేటప్పుడు జాగ్రత్తలు వహించాలి. చెమట ఎక్కువగా పట్టడంతో శరీరం అంతా బురదగా మారుతుంది. దీంతో అలర్జీలు వస్తాయి. దీంతో మనం శృంగారానికి సిద్ధమైనప్పుడు అన్ని చూసుకోవాలి. ముఖ్యంగా ఓరల్ శృంగారం ఈ కాలంలో సురక్షితం కాదు. దీని వల్ల ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎండాకాలంలో శృంగారం చేసేందుకు కొన్ని పరిమితులు ఉంటాయి.
చెమట ప్రభావం వల్ల జననేంద్రియాలపై కూడా కొన్ని రకాల అలర్జీలు ఏర్పడతాయి. జననేంద్రియాలపై బట్టలు కప్పబడి ఉంటాయి కాబట్టి వేడి ఎక్కువగా ఉంటుంది. దీంతో మనకు ఇబ్బందులు ఏర్పడతాయి. ఎండాకాలంలో శృంగార ప్రక్రియ అంత సవ్యంగా ఉండదు. మహిళలతో పాటు పురుషులు జాగ్రత్తలు వహించాలి. వేసవిలో కొన్ని చిట్కాలు పాటించి సురక్షితమైన శృంగారాన్ని ఆస్వాదించాలి.
ఈ కాలంలో చర్మంపై దద్దుర్లు, యోనిలో ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. దీంతో బ్యాక్టీరియా ఒకరి నుంచి మరొకరికి అంటుకుంటుంది. శృంగార వాంఛలు ఉన్నా పరిమితంగా స్పందించాలి. జననాంగాలను పరిశుభ్రం చేసుకున్న తరువాతే శృంగారంలో పాల్గొనాలి. లేదంటే ఇబ్బందులు తలెత్తడం ఖాయం. ఇంట్లో ఉన్నా చెమట ఎక్కువగా పడుతుంది.
గది ఉష్ణోగ్రత కూడా అధికంగా ఉంటుంది. దీని వల్ల శృంగారానికి అంత అనువుగా ఉండదు. గదిలో కూలర్ వేసుకుని వాతావరణాన్నిచల్లగా చేసుకోవాలి. అలా అయితేనే శృంగారంలో పాల్గొనేందుకు బాగుంటుంది. దీని వల్ల రతి క్రీడ రసవత్తరంగా సాగుతుంది. దీంతో మనం శృంగారానికి అనువైన పరిస్థితులు ఉంటేనే పాల్గొనాలి. లేదంటే ఇబ్బందులు వస్తాయి.






