NTR Rs 100 coin : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈనెల 28న న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఎన్టీఆర్ రూ. 100 నాణేన్ని విడుదల చేయనున్నారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఎలుగెత్తిచాటిన నందమూరి తారక రామారావు శత శతాబ్ది సంవత్సరానికి సంబంధించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్మారక నాణేన్ని రాష్ట్రపతి విడుదల చేయనున్నారు.
రాష్ట్రపతి ఈ మేరకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు రూ.100 నాణేం విడుదల సందర్భంగా ఆహ్వానం పంపారు. ఎన్టీఆర్ కుమార్తె, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పూర్ణందేశ్వరిని ఆహ్వానించారు. ఆమె ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
నందమూరి తారక రామారావు (28 మే 1923 – 18 జనవరి 1996) మధ్య జీవించి ఉన్నారు. నటుడిగా.. రాజకీయ నాయకుడిగా ఏపీకి ఎంతో సేవ చేశారు. భారతీయ నటుడు, చలనచిత్ర నిర్మాత , రాజకీయ నాయకుడు, మూడు పర్యాయాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఏడు సంవత్సరాలు పనిచేశాడు. 300 పైగా చిత్రాలలో నటించాడు. ప్రధానంగా తెలుగు సినిమాల ఇలవేల్పు అయ్యారు. విశ్వ విఖ్యాత నట సార్వభౌముడిగా కీర్తించబడ్డారు.
రూ.100 స్మారక నాణెం జారీకి సంబంధించి మార్చి 20, 2023న ఆర్థిక మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 2023 సంవత్సరం ఇప్పటికే పదకొండు స్మారక నాణేలను చేశారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.