
Prime Minister Modi : ప్రధాని నరేంద్ర మోదీకి మరో అత్యున్నత పురస్కారం దక్కింది. ఫిజి దేశం ఆయన ప్రపంచ స్థాయి నాయకత్వాన్ని గుర్తించింది. ది కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ పురస్కారంతో సత్కరించింది. ఫిజియేతరులకు ఈ అవార్డు ప్రకటించడం అరుదు. అతి కొద్ది మందికి మాత్రమే ఈ అవకాశం వచ్చింది. తాజాగా ఈ పురస్కారం దక్కడం భారతీయులంతా గర్వపడే సందర్భమని కేంద్రం తెలిపింది. మోదీ ప్రపంచస్థాయి నేత అని మరోసారి నిరూపితమైందని పేర్కొంది.
మోదీకి ఈ పురస్కారాన్ని సితవేణి రబుకా అనే ఫిజి దేశస్తుడి నుంచి అందుకున్నారు. ఇది ఎంతో భారతీయులకు ఎంతో గౌరవమని కేంద్రం తెలిపింది. రెండు దేశాల మధ్య సఖ్యతకు కారణమైన భారత ప్రజలకు దీనిని అంకితమిస్తున్నట్లు మోదీ చెప్పినట్లు సమాచారం. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ తన ట్విట్టర్ లో పేర్కొంది. భారత్ ఫిజి దేశాల మధ్య రాబోయే రోజుల్లో మరింత సఖ్యతతో కూడిన బంధాన్ని మెరుగు పరుచుకొని కలిసి పని చేయడానికి ఎదురు చూస్తున్నట్లు ప్రధాని మోదీ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ప్రధాని మోదీకి గతంలోనూ పలు పౌర పురస్కారాలు దక్కాయి.
ఇటు మోదీకి ఫిజికి చెందిన పౌర పురస్కారం దక్కడంపై కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు స్పందించారు. ఇది దేశానికి గర్వకారణమని చెప్పారు. మోదీ నాయకత్వ పటిమ ప్రపంచస్థాయిలో గుర్తింపుపొందుతున్నదని రానున్న రోజుల్లో ఆయన నాయకత్వంలో భారత్ అగ్రరాజ్యంగా ఎదగబోతున్నదని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రులు కూడా ఫిజి దేశంతో భారత్ కు ఉన్న మిత్రబంధాన్ని గుర్తు చేసుకున్నారు.