
Prime Minister Modi : బైడెన్, రిషి సునాక్ తదితరులను వెనక్కి నెట్టిన చాయ్ వాలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్య దేశాల్లో ప్రజలు తమ పాలకులపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ తరుణలో భారత ప్రధాని నరేంద్ర మోడీకి వస్తున్న పాపులారిటీ మాత్రం అగ్రరాజ్యాధినేతలను సైతం అసూయ పడేలా చేస్తున్నాయి.ప్రజలు తమ పాలకులపై అభిప్రాయాలను తెలుసుకునేందుకు మార్నింగ్ కన్సల్ట్ సంస్థ సర్వే చేపట్టింది. 22 ప్రధాన దేశాల నాయకులలో కేవలం నలుగురు నాయకులు మాత్రమే అత్యధిక రేటింగ్ పొందారు. ఈ నలుగురు కూడా వారి స్వ దేశాల్లో 50 శాతానికి పైగా ప్రజల్లో సానుకూల స్పందన పొందారు.
ఈ సర్వేలో భారత ప్రధాని నరేంద్ర మోదీకి 78 శాతం రేటింగ్ అగ్రస్థానంలో నిలిచారు. సమ్మిళిత, అభివృద్ధి, అవినీతి రహిత పాలనను మోదీ అందిస్తు్న్నరాని ప్రజలు తమ సర్వేలో తేల్చి చెప్పారని సంస్థ ప్రకటించింది. సేవలు, సంక్షేమ పథకాలు ప్రధాని మోదీని అగ్రస్థానంలో నిలబెట్టాయి. టాప్ హెల్త్ జర్నల్స్‌లో ఒకటైన లాన్సెట్ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రశంసించింది, ఈ పథకం దేశంలోని ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిందని పేర్కొంది. మార్నింగ్ కన్సల్ట్ ప్రకారం, దేశీయ ప్రజాదరణలో PM మోడీ తర్వాత స్విట్జర్లాండ్ అధ్యక్షుడు అలైన్ బెర్సెట్, మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడోర్, ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ ఉన్నారు.
సగానికి తగ్గిన పాపులారిటీ..?
ఇతర దేశాధినేతలు చాలా మంది, తమకు అనుకూలంగా ఉన్న ఓటర్ల శాతంలో సగం మార్కును కూడా దాటలేకపోయారు. ఇటలీ ప్రీమియర్ జార్జియా మెలోనికి ఏజెన్సీ ప్రకారం 49 శాతం ప్రజామోదం లభించింది. ఆమె తర్వాత 42 శాతం రేటింగ్‌తో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిలిచారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు 39 శాతం ఓట్లు పోల్ కాగా, జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్‌కు 34 శాతం ఓట్లు, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కు కేవలం 33 శాతం ఓట్లు, జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాకు 33 శాతం ఓట్లు మాత్రమేయ వచ్చాయి. G7 గ్రూప్ సమ్మిట్ కేవలం 31 శాతం మాత్రమే ప్రజామోదాన్ని కలిగి ఉంది.ఇండియాలో 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోదీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, బీజేపీ ఫేవరెట్ ఉందని మార్నింగ్ కన్సల్ట్ సర్వే పేర్కొంటుంది. కానీ ఇదే సమయంలో ఇప్పటికిప్పడు ఎన్నికలు నిర్వహిస్తే రిషి సునక్ కన్జర్వేటివ్ పార్టీ లేదా మిస్టర్ స్కోల్జ్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ, ట్రూడో లిబరల్ గెలిచే అవకాశాలు చెప్పలేమని పేర్కొంది.
G-7లో చాలా మంది నాయకులు తమ స్వదేశాల్లో ఈ ఫీట్ ను సాధించకపోవడం ఇదే మొదటిసారి కాదు. ప్రజలపై మార్కెట్, ప్రభత్వ విధానాలు ప్రభావితం చేస్తున్నాయి. సాధారణంగా మాంద్యం లేదా ప్రతిష్టంభన ఉన్నప్పుడు ఇలా జరుగుతుందని ఆర్థిక వేత్తలు, మేధావులు పేర్కొంటన్నారు. అయితే ప్రస్తుతం ఇవి ఏవీ లేకపోయినా ప్రజల మద్దతు కొల్పోడం ఆలోచించాల్సిన విషయమని పేర్కొంటున్నారు. అయినప్పటికీ, కోవిడ్ -19 మహమ్మారి తరువాత ఆర్థిక పరిస్థతితుల, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం కారణంగా G7 నాయకులు తమ ప్రజల విశ్వాసాన్ని కోల్పోతున్నారని పొలిటికల్ ఎనలిస్ట్ లు పేర్కొంటున్నారు. అయితే, ప్రధాని మోదీ మార్చి 2020- జూన్-2022 మహమ్మారి కాలాన్ని చాలా సమర్థవంతంగా ఎదుర్కొగలిగారని సర్వే సంస్థ ప్రకటించింది.