
our health : ఆరోగ్యం కోసం చాలా చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా మనం రోజు చేసే కొన్ని పనులు సక్రమంగా చేస్తే మనకు రోగాలు రాకుండా ఉంచడానికి అవకాశం ఏర్పడుతుంది. దీనికి మనం చేయాల్సిందల్లా చిన్న పాటి పరిహారాలే. మనం రోజు తీసుకునే పదార్థాలే కానీ కచ్చితంగా వీటిని వాడితే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది.
నిమ్మకాయ నీళ్లు రోజు తాగాలి. క్రమం తప్పకుండా గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ పిండుకుని తాగితే మనకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. రోజు రెండు మూడు బాదంలు రాత్రి నానబెట్టి ఉదయం పూట పరిగడుపున అవి కడుపులోకి తీసుకుంటే మన ఆరోగ్యం మెండుగా ఉండటం ఖాయం. ఇంకా పెరుగు కూడా మనకు ఎంతో ఉపయోగపడుతుంది. రాత్రి పులియబెట్టిన పెరుగు ఉదయం తీసుకుంటే మన శరీరంలోకి మంచి బ్యాక్టీరియా వెళ్లి ఆరోగ్యం కుదుటపడుతుంది.
పసుపు మనం కూరల్లో వాడుతుంటాం. కానీ అధిక మోతాదులో వాడుకున్న ఫలితమే వస్తుంది. అల్లం మన శరీరానికి ఎంతో మంచిది. రోజుకో అల్లం ముక్క నమిలినా ఎంతో మేలు కలిగిస్తుంది. వెల్లుల్లి మనకు ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. వాసన కోసం పప్పులో వేస్తుంటాం. దీంతో మనకు చాలా రకాల మేలు కలుగుతుందనడంలో సందేహం లేదు.
రోజుకో రెండు మూడు ఎండుద్రాక్షలు తిన్నా ఆరోగ్యమే. డ్రై ఫ్రూట్స్ లో ఎన్నో రకాల ఔషధాలు దాగి ఉంటాయి. ఇంకా ప్రతి రోజు వాకింగ్ చేయాలి. దీంతో కూడా మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇలా మనం రోజు చేసే పనుల్లో ఇవి ఉండేలా చూసుకుంటే మన ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. మనకు అనారోగ్యం రాకుండా చేస్తాయి. వీటిని పాటించి చూడండి.