
అమెరికా బిలియనీర్ జెఫ్రీ ఎప్‌స్టీన్ రెండు ప్రైవేట్ ద్వీపాలు గ్రేట్ సెయింట్ జేమ్స్ ,లిటిల్ సెయింట్ జేమ్స్‌లను కొనుగోలు చేశాడు. ఈ అమెరికా బిలియనీర్ రిసార్ట్ లకు గమ్యస్థానంగా ఈ దీవులను మార్చడానికి సిద్ధంగా ఉన్నారు. npr.org యొక్క నివేదిక ప్రకారం ఎప్స్టీన్ చాలా మోసాలు, దుర్వినియోగాలకు పాల్పడ్డట్టు ఆరోపణలున్నాయి. ముఖ్యంగా యువతులు , తక్కువ వయస్సు గల బాలికల అక్రమ రవాణాకు పేరుగాంచాడు. ఈ ద్వీపాలు కొని ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతాడని.. అందుకే కొన్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
2019లో ఎప్స్టీన్ మరణించినప్పటి నుండి రెండు islands సందిగ్ధంలో పడ్డాయి. ఇప్పుడు బిలియనీర్ స్టీఫెన్ డెకాఫ్ నేతృత్వంలోని పెట్టుబడి సంస్థ ఈ రెండు ద్వీపాలను $60 మిలియన్లకు కొనుగోలు చేసింది. ఆసక్తికరంగా కొనుగోలు ధర $110 మిలియన్ల కంటే చాలా తక్కువగా ఉంది. రెండు ఆస్తులు ఇటీవల జాబితా చేయబడ్డాయి.
రెండు ద్వీపాలు అమెరికా వర్జిన్ దీవులలో సెయింట్ థామస్ సమీపంలో ఉన్నాయి. ఎప్స్టీన్ , అతని సహచరుడు ఘిస్లైన్ మాక్స్‌వెల్‌పై న్యాయపరమైన విచారణలో ఈ ద్వీపాలు ముఖ్యమైన పాత్ర పోషించాయి. చాలా మంది యువతులను ప్రైవేట్ విమానంలో ఈ ద్వీపాలకు రవాణా చేసినట్లు ఆరోపణలున్నాయి. ఎప్స్టీన్ మరియు ఇతర పురుషులతో లైంగిక కార్యకలాపాలలో పాల్గొనేలా బలవంతం చేయబడిన ప్రదేశంగా ఈ ద్వీపాలను గుర్తించారు. కోర్టు పత్రాలలో ఈ మేరకు ప్రస్తావించారు.
కొనుగోలుదారు డెకాఫ్ ద్వీపాలను “ప్రపంచ స్థాయి గమ్యస్థానంగా” మార్చాలని యోచిస్తున్నట్లు చెప్పారు. ప్రకృతి రమణీయత దెబ్బతినకుండా ఈ ప్రాంతాన్ని మార్చేస్తానని హామీ ఇచ్చారు.
డెకాఫ్ అత్యాధునికమైన, ఫైవ్ స్టార్, ప్రపంచ స్థాయి లగ్జరీ 25-గదుల రిసార్ట్‌ను ఈ ద్వీపాలలో అభివృద్ధి చేయాలని యోచిస్తోంది, ఇది పర్యాటకాన్ని పెంపొందించడానికి, ఉద్యోగాలను సృష్టించడానికి ,ఈ ప్రాంతంలో ఆర్థిక అభివృద్ధిని పెంపొందించడానికి, ముఖ్యమైన పర్యావరణాన్ని గౌరవిస్తూ ,సంరక్షించడానికి సహాయపడుతుందని ప్రకటించారు.
గత సంవత్సరం డిసెంబర్‌లో, అమెరికా వర్జిన్ ఐలాండ్స్ ప్రభుత్వం లిటిల్ సెయింట్ జేమ్స్ అమ్మకం ద్వారా 50% ఆదాయాన్ని పొందింది. దీని ప్రకారం $105 మిలియన్ విలువైన సెటిల్‌మెంట్ జరిగింది. లైంగిక వేధింపులు ,మానవ అక్రమ రవాణాతో బాధపడుతున్న మహిళలకు సహాయక సేవలు మరియు కౌన్సెలింగ్ అందించే ట్రస్ట్‌ను స్థాపించడానికి ఈ డబ్బు ఉపయోగించారు.






