39.9 C
India
Tuesday, April 21, 2026
More

    Priyanka : తెలంగాణపై ప్రియాంకకు పట్టు చిక్కేనా?

    Date:

    Priyanka-Gandhi
    Priyanka Gandhi

    Priyanka Gandhi : తెలంగాణ పాలిటిక్స్ లో ఇప్పుడు కొత్త పేరు వినిపిస్తుంది. ఆ పేరే ప్రియాంకా గాంధీ. దాదాపు పదేళ్లుగా ప్రభుత్వానికి దూరమైన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఊపుమీద ఉంది. ఈ సారి ఎలాగైనా ప్రభుత్వం తమదే కావాలని శతవిధాల ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగానే 8న హైదరాబాద్ లోని సరూర్ నగర్ లో ‘నిరుద్యోగ యువగర్జన’ సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు ప్రియాంక గాంధీ హాజరవుతుంది. ఈ వేదిక నుంచి ‘యూత్ డిక్లరేషన్’ ఇవ్వనున్నారు ప్రియాంక. గతంలో ఆమె చాలా సార్లు తెలంగాణకు వచ్చినా సభలు, ప్రచారాల్లో మాత్రం పాల్గొనలేదు.

    ఏఐసీసీ సభ్యురాలిగా ప్రస్తుతం ప్రియాంకా గాంధీ కొనసాగుతున్నారు. ఇప్పుడు ప్రియాంకా గాంధీ దక్షిణాది బాధ్యతలను తీసుకోబోతున్నారు. గతంలో ఉత్తరాధి బాధ్యతలు తీసుకున్న ఆమె ఇప్పుడు దక్షిణ భారతదేశంపై దృష్టి సారిస్తున్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ ఇలా అన్ని రాష్ట్రాల్లో పట్టుకోసం పావులు కదుపుతున్నారు. తెలంగాణ ఇన్ చార్జి బాధ్యతలు చేపట్టే అకాశం ఉంది. ఇది అధికారికంగా కాకపోయినా అనధికారికంగా మాత్రం ఆమె బాధ్యతలు చేపట్టినట్లే అంటూ తెలుస్తోంది.

    కాంగ్రెస్ లో సీనియర్ల గురించి చెప్పుకోవాలంటే వారంతా రాజకీయ ఉద్ధండ పండితులనే చెప్పుకోవాలి. వారి జీవితకాలం కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన వారే ఎక్కువ మంది ఉన్నారు.  అయితే ఇటీవల టీపీసీసీ బాధ్యతలు రేవంత్ కు ఇవ్వడంతో వారంతా గుస్సాగా ఉన్నారు. అయితే సోనియా గాంధీ అన్నా.. ఆమె కుటుంబ సభ్యులన్నా ఇక్కడి సీనియర్ నాయకులకు వల్లమాలిన అభిమానం ఆమె వారిని ఒక దారికి తేవడంలో సక్సెస్ అవుతుందని ఘంటాపథంగా చెప్పవచ్చు.

    తెలంగాణ పాలిటిక్స్ లో ఆమె బీఆర్ఎస్ తో కన్నా బీజేపీతో ఎక్కువగా సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ రెండు దఫాలుగా అధికారంలో ఉంటూ.. ప్రస్తుతం పట్టు కోల్పోతుంది. కానీ బీజేపీ మాత్రం వేగంగా పుంజుకుంటుంది. ఇప్పటి వరకూ తెలంగాణను పక్కన బెట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది లేదు. కానీ ఈ సారి ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా కేంద్ర నాయకత్వం ప్రధానంగా దృష్టి పెట్టింది. అపర చాణక్యుడు అమిత్ షా, మోడీ తంత్రాలను తట్టుకోవడం ఆమె వల్ల కాకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

    రాజకీయాల్లో ఆమెకు ఇప్పటి వరకూ కలిసి రాలేదు. ప్రతక్ష్య రాజకీయాల్లో ఆమె పాత్ర చాలా తక్కువనే చెప్పాలి. గతంలో ఆమెథీలో తల్లి సోనియా గాంధీకి, సోదరుడు రాహుల్ గాంధీ కోసం ప్రియాంకా ప్రచారం చేశారు. ఆ సమయంలో ఆమె ప్రముఖ వ్యక్తిగా నిలిచారు. ఆమె వస్తున్నారంటే జనం అధికంగా వచ్చేవారు. కానీ 2007 ఎన్నికల్లో రాహుల్ గాంధీ నియోజకవర్గం ఆమేథీ, రాయ్ బరేలి సెగ్మెంట్లపై ఆమె ప్రధానంగా దృష్టి పెట్టారు. దాదాపు 20 రోజుల వరకూ అక్కడే ఉండి ప్రచారం నిర్వహించారు. కానీ ఎలాంటి ఫలితం దక్కలేదు. కాంగ్రెస్ అక్కడ తుడిచిపెట్టుకుపోయింది. 402 సీట్లకు గానూ 22 మాత్రమే సాధించింది.

    అయితే తెలంగాణలో ఆమె మంచి ఫలితాలు సాధించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక్కడ బీజేపీ కంటే కాంగ్రెస్ కు క్యాడెర్ ఎక్కువగా ఉంది. ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోవచ్చు. ఈ నేపథ్యంలో ఆమె తెలంగాణపై దృష్ణి పెడితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    YS Sharmila : విజయవాడలో వైఎస్ షర్మిల గృహ నిర్బంధం

    YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల...

    CM Siddaramaiah : లక్ష మంది ముందు ఏఎస్పీపై చేయి చేసుకునేందుకు ప్రయత్నించిన సీఎం సిద్ధరామయ్య – తీవ్ర దుమారం

    CM Siddaramaiah : కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. బెళగావిలో...

    Encounter : కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్: 30 మందికి పైగా మావోయిస్టులు మృతి?

    Encounter : తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టల అటవీ ప్రాంతం మరోసారి రక్తసిక్తమైంది....

    Telangana : హెచ్‌సీయూ విద్యార్థుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం

    Telangana Deputy CM : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క...