
Problems in iPhone 15 : ఆపిల్ సంస్థ ‘ఐఫోన్-15’ను రీసెంట్ గా (సెప్టెంబర్ 22, 2023) రిలీజ్ చేసింది. చాలా సమయం తర్వాత ఈ ఫోన్ రిలీజ్ చేసింది ఆపిల్ సంస్థ. అయితే ఈ ఫోన్ లో కొన్ని సమస్యలు ఉన్నాయని యూజర్ల నుంచి భారీగా మెయిల్స్ వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రధాన సమస్య ఓవర్ హీటింగ్. ఫోన్ వాడుతుంటే ఓవర్ హీట్ అవుతుందని మొత్తుకుంటున్నారు.
ఐఫోన్ 15 ప్రో, ప్రో మ్యాక్స్ ఇతర మోడళ్లలో కనిపించే స్టెయిన్ లెస్ స్టీల్ ఫ్రేమ్ కు భిన్నంగా టైటానియం ఫ్రేమ్ ఉంది. దీనిపై కూడా ఫిర్యాదులు వస్తున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్ ‘బెండ్ టెస్ట్’లో కూడా విఫలమైందని, వినియోగదారుడు వట్టి చేతులతో వంచితే పగిలిపోతుందని కొందరు అంటుంటే, కేసు లేకుండా ఉంచితే రంగు మారుతుందని మరికొందరు గమనించారు.
టెక్ కంటెంట్ సృష్టికర్త మోహిత్ వర్మ ఎక్స్ (గతంలో ట్విట్టర్) లో షేర్ చేసిన ఒక పోస్ట్ లో ఐఫోన్ 15 వేడి గురించి కామెంట్ చేశాడు. ‘ఐఫోన్-15 ప్రో టైటానియం మోడల్ చాలా వేడిగా ఉంటుందని, పట్టుకోవడం కష్టమవుతుందని పేర్కొన్నారు. కేవలం 2 నిమిషాలు వాడడం, 8 లేదా 10 నిమిషాలు రీల్స్ స్క్రోల్ చేసినా వేడెక్కుతుంది. ఇది నాకు కొత్త సమస్య, ఎందుకంటే నేను ఇంతకు ముందు ఏ ఫోన్ తోనూ దీనిని ఎదుర్కోలేదు.’ అంటూ ట్వీట్ లో పేర్కొన్నాడు.
థర్మామీటర్ తో ఫోన్ ఉష్ణోగ్రతను కొలిచే వీడియోను వర్మ సందేశంతో పాటు ఇప్పటికే మిలియన్ మందికి పైగా వీక్షించారు. ఐఫోన్ 15 ప్రో 42 డిగ్రీల సెల్సియస్ లేదా 107.6 డిగ్రీల ఫారెన్ హీట్ కు చేరుకున్నట్లు ఫుటేజీలో కనిపించింది. దీనితో పాటు కవర్ తొలగిస్తే రంగు మారుతుందని, కేవలం చేతి వేళ్లతో వంచితే వెనుక ఉన్న గ్లాస్ పగిలిపోతుందని చెప్పారు.
దీనికి సంబంధించిన వీడియో ఇప్పడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే వీటిని కొందరు ఖండిస్తున్నారు. ఇది ఏదో ఒక ఫెయిల్ పీస్ కావచ్చని కామెంట్లు చేస్తున్నారు. తాము వాడే ఫోన్లలో ఎటువంటి సమస్యలు లేవని చెప్తున్నారు.
The natural titanium iPhone 15 Pro gets extremely hot, so much so that it becomes difficult to hold. Furthermore, it heats up after just a 2-minute FaceTime call or when scrolling through reels for 8-10 minutes. This is a new issue for me, as I’ve never encountered this with any… pic.twitter.com/Qu0QK1xGLd
— Mohit Verma (@itz_mohitverma) September 25, 2023