Toliprema remuneration : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను తన ఫ్యాన్స్ దేవుడు కంటే ఎక్కువుగా పూజిస్తారు అనే విషయం తెలిసిందే.. పవన్ కెరీర్ స్టార్టింగ్ లో యూత్ ఫుల్ ఎంటర్టైనర్స్ ఎక్కువుగా చేయడంతో ఈయనకు ఈ రేంజ్ లో క్రేజ్ పెరిగింది. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఇప్పటి వరకు సూపర్ హిట్ సినిమాలు చాలానే ఉన్నాయి. మరి ఆ సినిమాల్లో తొలిప్రేమ ఒకటి.. ఈ సినిమా గురించే ప్రత్యేకంగా చెప్పుకోవాలి..
1998 జులై 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. కరుణాకరన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో పవన్ కు జోడీగా కీర్తి రెడ్డి హీరోయిన్ గా నటించింది. 2023, జులై 24 వస్తే ఈ సినిమా రిలీజ్ అయ్యి సరిగ్గా 25 ఏళ్ళు అవుతుంది. అందుకే ఈ సందర్భంగా మేకర్స్ ఈ సినిమాను రీ రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 30న ఈ సినిమా రీ రిలీజ్ కాబోతుంది.
ఈ క్రమంలోనే నిర్మాత జీవీజీ రాజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు. అప్పుడప్పుడే పవన్ ఎదుగుతున్న నేపథ్యంలో ఈయన రెమ్యునరేషన్ లక్షల్లోనే ఉండేదని అది ఎలా ఇచ్చారో ఈయన చెప్పుకొచ్చారు. ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ కు ముందుగా రెమ్యునరేషన్ ఫిక్స్ చేసి ఆ తర్వాత ఆ మొత్తాన్ని ఎలా ఇవ్వాలని అడిగారట..
అప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పిన మాటను గుర్తు చేసుకున్నారు. మీకు ఎలా వీలైతే అలాగే ఇవ్వండి అని పవన్ అనడంతో ముందుగా కొంత అడ్వాన్స్ ఇచ్చి రిలీజ్ ముందు బ్యాలెన్స్ సెటిల్ చేస్తానని చెప్పారట. కానీ పవన్ నెల నెల కొంత ఖర్చుల కోసం ఇవ్వమని అడగడంతో నిర్మాత అలాగే డబ్బు ఇవ్వడంతో ఆయన బుక్స్, మొబైల్ ఫోన్ కొనుకున్నారని చెప్పుకొచ్చారు. ఇక మిగిలిన మొత్తం రిలీజ్ అయిన రెండో రోజు పళ్లెంలో పెట్టి మరీ ఇచ్చినట్టు చెప్పారు.