CM help Bhola Shankar : ఆంధ్రప్రదేశ్ లో టికెట్ల గోల ఎప్పుడు ఉండేదే. ప్రభుత్వం సినిమా టికెట్ల రేట్ల విషయంలో పూర్తి ఆధిపత్యం చెలాయిస్తుండటంతో టికెట్ల రేట్లు పెంచుతారనే వాదన వస్తోంది. దీంతో చిరంజీవి సినిమా భోళా శంకర్ సక్సెస్ కు టికెట్ల రేట్లు ప్రతిబంధకంగా మారుతాయనే భయం పట్టుకుంది. గతంలో పవన్ కల్యాణ్ సినిమాల విషయంలో టికెట్ల రేట్లు పెంచి సినిమాల మీద అధికారం చెలాయించిన ప్రభుత్వం చూపు ఇప్పుడు చిరంజీవి సినిమాపై పడింది.
దీంతో టికెట్ల రేట్లు పెంచొద్దని అభ్యర్థిస్తున్నారు. తమ సినిమా సక్సెస్ కు టికెట్ల రేట్లు సవాలుగా మారుతాయి. టికెట్ల రేట్లు పెంచితే ప్రేక్షకులు సినిమా చూసేందుకు వెనకడుగు వేస్తారు. అందుకే టికెట్ల ధరలు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చిరు ఇమేజ్ కు తగినట్లుగా సినిమా నిర్మించినట్లు చెబుతున్నారు. ప్రేక్షకులు నిరభ్యంతరంగా సినిమా చూసి సంతోషం ఫీలవుతారని పేర్కొంటున్నారు.
ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా నటిస్తోంది. సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతం సమకూర్చారు. చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇతర పాత్రల్లో మురళీశర్మ, రఘుబాబు, రావు రమేష్, వెన్నెల కిషోర్, రవిశంకర్, శ్రీముఖి, ప్రగతి, బిత్తిరి సత్తి, రష్మీ గౌతమ్, ఉత్తేజ్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
భోళా శంకర్ ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమాకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏపీ ప్రభుత్వం టికెట్ల ధరలు పెంచకుండా చూడాలని చిత్రం యూనిట్ సీఎం జగన్ ను కలిసి విన్నవించింది. దీనిపై ఈ సాయంత్రం తీర్పు వస్తుందని అంటున్నారు. దీంతో సినిమా విజయం ఎలా ఉంటుందోననే బెంగ అందరిలో పట్టుకుంది.