
Project K : వచ్చే రెండేళ్లలో ఎన్నో భారీ అంచనాలున్న సినిమాలు రాబోతున్నాయి. ఇంతకు ముందు మరే తెలుగు సినిమా చేయలేని శిఖరాన్ని ఆర్ఆర్ఆర్, బాహుబలి చేరుకున్నాయి. అయితే ఆ రెండు భారీ విజయాలను మించిన సినిమా ఏది..? ఇటీవల ఇండియా టుడే కాన్ క్లేవ్ లో జరిగిన సమావేశంలో నటుడు, నిర్మాత రానా దగ్గుబాటి తాను నిజంగా ఎదురుచూస్తున్న సినిమా గురించి మాట్లాడారు.
రానా మాట్లాడుతూ ‘మేమిద్దరం ఒకరి సినిమాలను మరొకరు సెలబ్రేట్ చేసుకుంటాం. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్ ప్రధాన తారాగణంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ప్రాజెక్ట్ కె’ ఆర్ఆర్ఆర్, బాహుబలి హద్దులను బద్దలు కొట్టే ఈ చిత్రం చిత్ర పరిశ్రమనే కొత్త మలుపు తిప్పుతుందని భావిస్తున్నాను. ఆ సినిమా తెలుగు నుంచి గ్లోబల్ మూవీగా నిలవబోతోంది’ అన్నారు.
చాలా మంది తెలుగు నటులకు, పాన్ ఇండియా స్టార్ కు బాటలు వేసిన రానా, ఏ ఇతర సౌత్ నటుడి కంటే ముందే ప్రాజెక్ట్ కే ఒక గ్లోబల్ సినిమా అని, అంటే ఈ సినిమా సామర్థ్యం దానికంటే చాలా రెట్లు ఎక్కువ అని అన్నారు. కాబట్టి ఇది పుష్ప 2 లేదా సలార్ లేదా మరే ఇతర సినిమా కాదు, కానీ ప్రాజెక్ట్ కె అంతర్జాతీయ స్థాయిలో అద్భుతాలు చేయబోతోందని రానా చెప్పారు.
మహానటి లాంటి అపురూప కళా ఖండం తెరకెక్కించిన బ్యానర్ వైజయంతీ మూవీస్ పై ‘ప్రాజెక్ట్ కే’ కూడా వస్తుంది. దీంతో ఈ సినిమాపై భారీ అంచానాలే ఉన్నాయి. భారీ తారాగణంతో వస్తున్న చిత్రాన్ని నాగ్ అశ్విన్ తెరకెక్కించబోతున్నారు.
We celebrate each other’s cinema❤️there’s a film #ProjectK directed by Nag Ashwin with #Prabhas , Mr Bachchan and #DeepikaPadukone . That’s a film we’re really looking forward to in Telugu because that would break boundaries that Baahubali & RRR haven’t done – @RanaDaggubati 😍 pic.twitter.com/Eww6jjK0gE
— Dholu😏🥰 (@DholuTheDreamer) June 1, 2023