Project K Remunerations : యంగ్ రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో ఒక క్రేజీ అండ్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.. ప్రభాస్ నటించిన ఆదిపురుష్ వంటి భారీ సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి అది కూడా డిజాస్టర్ దిశగా అడుగులు వేస్తుంది. మరి నెక్స్ట్ లైనప్ లో ఉన్న మూవీల్లో ”ప్రాజెక్ట్ కే” ఒకటి..
ఈ సినిమాలో ఇప్పటికే బాలీవుడ్ స్టార్స్ దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్ వంటి వారు భాగం అవ్వగా తాజాగా లోకనాయకుడు కమల్ హాసన్ భాగం అయిన విషయం తెలిసిందే.. నిన్ననే ఈయన కూడా భాగం అయినట్టు అఫిషియల్ అప్డేట్ వచ్చింది. 500 కోట్ల బడ్జెట్ తో టైం పిరియడ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి రోజుకొక వార్త నెట్టింట వైరల్ కాగా భారీ హైప్ పెరుగుతుంది.
ఇక తాజాగా ఈ సినిమాలో భాగం అయిన స్టార్స్ రెమ్యునరేషన్స్ గురించిన వార్త నెట్టింట వైరల్ అవుతుంది. ప్రభాస్ నుండి ఈ సినిమాలో భాగం అయిన నటీనటులు భారీగా పుచ్చుకున్నట్టు టాక్ వస్తుంది. కేవలం వీరి పారితోషికాల కోసమే 200 కోట్లు వెచ్చిస్తున్నారని టాక్..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం ప్రాజెక్ట్ కే కోసం 150 కోట్లు తీసుకోగా.. దీపికా 10 కోట్లు డిమాండ్ చేసిందట.. అలాగే కమల్ హాసన్ 20 కోట్లు డిమాండ్ చేయగా అమితాబ్ బచ్చన్ 15 కోట్ల వరకు అందుకున్నట్టు టాక్.. ఇక ఇందులో బాలీవుడ్ యంగ్ హీరోయిన్ దిశా పటానీ కూడా ఉండగా ఈమెకు 5 కోట్లు సమర్పించుకున్నారని సమాచారం.. ఈ రెమ్యునరేషన్స్ విని అంతా షాక్ అవుతున్నారు..