Women shaving video బ్రహ్మంగారు ఏనాడో చెప్పారు. కలియుగంలో వింతలు చోటుచేసుకుంటాయని. ఇప్పుడు అవే జరుగుతున్నాయి. సాధారణంగా మగవాళ్లు క్షౌరశాలకు వెళ్లి షేవింగ్, కటింగ్ తీసుకోవడం సహజమే. కానీ ఓ అమ్మాయి ఇలా చేయడం వింత కలిగించింది. మగవాడిలా కుర్చీలో కూర్చుని తన చెంపలకు క్రీమ్ రాయించుకుని షేవింగ్ చేయించుకుంది. దీంతో చూసేవారు విడ్డూరంగా ఫీలయ్యారు.
బ్రహ్మంగారు చెప్పిన వింతలు, విశేషాలు ఎక్కడో కాదు ఇక్కడే జరుగుతున్నాయని చోద్యం చూశారు. ఆమె తీరుకు చెవులు కొరుక్కుకున్నారు. చూశారా విడ్డూరం అంటూ నోళ్లు వెళ్లబెట్టారు. అచ్చం మగాడిలాగే ఆమె షేవింగ్ చేయించుకోవడం పలువురికి విస్మయం కలిగించింది. వింతలు, విశేషాలు ఎక్కడో ఉండవు మన చుట్టే ఉంటాయని ఆశ్చర్యపోయారు.
రోజు షేవింగ్ చేయడం చర్మానికి మంచిదని చెబుతోంది. దీని వల్ల చనిపోయిన కణాలు తొలగిపోతాయి. చర్మం మరింత సహజసిద్ధంగా మారుతుంది. దీని వెనక అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని అంటోంది. మహిళలు కూడా అన్నింట్లో సమానమని చెప్పడానికే ఇలా చేస్తున్నారని కామెంట్లు పెడుతున్నారు. ఏంటీ పిచ్చి పనులు అని కొందరు ప్రశ్నిస్తున్నారు.
కలియుగంలో వింతలు చోటుచేసుకుంటాయనడానికి ఇదే తార్కాణం. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చూసిన నెటిజన్లు 5జీ కాలం కదా అని నిట్టూరుస్తున్నారు. మహిళలు అన్నింట్లో సమామని చెబుతున్నారు కదా అందుకే ఈ షేవింగ్ అని కామెంట్లు పెడుతున్నారు. ఎవరి పిచ్చి వారికి ఆనందం అంటూ కొందరు అంటున్నారు.
https://www.sakshi.com/telugu-news/family/woman-getting-her-face-shaved-salon-video-goes-viral-1729802