TDP Protests At Washington :
చంద్రబాబు అరెస్టు వ్యవహారం రాష్ట్రంతో పాటు విదేశాల్లో సైతం నిరసన గళం విప్పుతున్నారు. ఈనేపథ్యంలో ప్రతిపక్షాలను గొంతు నొక్కుతున్న జగన్ తీరును అందరు ఆక్షేపిస్తున్నారు. ఏపీలోనే కాకుండా విదేశాల్లో కూడా జగన్ కు వ్యతిరేకంగా నిరసనలు తెలియజేస్తున్నారు. అన్ని వర్గాల నుంచి వస్తున్న నిరసనలను పట్టించుకోవడం లేదు. కానీ బాబుకు మద్దతు పెరుగుతోంది.
వాషింగ్టన్ లో టీడీపీ మద్దతుదారులు చంద్రబాబుకు సపోర్టుగా నిరసన వ్యక్తం చేశారు. జై బాబు జైజై బాబు అంటూ నినాదాలు చేశారు. వైసీపీ డౌన్ డౌన్ అంటూ తమ నిరసన గళం విప్పారు. దీనికి తోడు రాష్ట్రంలో కూడా చంద్రబాబుకు అండగా నిలుస్తున్నారు. వైసీపీ చర్యను ఖండిస్తున్నారు. టీడీపీ నేతలు కొవ్వొత్తుల ర్యాలీ తీస్తూ చంద్రబాబును విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
కక్షపూరిత విధానాలతోనే జగన్ ఇలాంటి పక్షపాత నిర్ణయాలు తీసుకోవడం సమంజసం కాదని చెబుతున్నారు. ప్రవాస భారతీయులు కూడా బాబుకు అండగా నిలిచి ధర్నా చేశారు. వైట్ హౌస్ ఎదుట టీడీపీ జెండాలు పట్టుకుని చంద్రబాబును విడుదల చేయాలని గట్టిగా నినదించారు.
చంద్రబాబు అరెస్టుపై విమర్శలు పెరుగుతూనే ఉన్నాయి. నియంత పోకడలతో వైసీపీ పెద్ద తప్పిదం చేసిందని సూచిస్తున్నారు. ఇప్పటికైనా తప్పు దిద్దుకోకపోతే తగిన మూల్యం చెల్లిస్తారని హెచ్చరిస్తున్నారు. ఈనేపథ్యంలో చంద్రబాబుపై కక్షపూరితంగానే వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. దీంతో చంద్రబాబుకు అన్ని దిక్కుల మద్దతు పెరుగుతోంది.
చంద్రబాబు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా వాషింగ్టన్ డీసీలో ప్రవాసాంధ్రుల నిరసన ప్రదర్శన#TDPJSPTogether#APvsJagan#IAmWithBabu#PeopleWithNaidu#FalseCasesAgainstNaidu #CBNWillBeBackWithABang pic.twitter.com/lU1knnHZdl
— Telugu Desam Party (@JaiTDP) September 17, 2023