
Purnananda swamiji : ఆమె మనవరాలి వయసున్న బాలిక. ఎవరు లేకపోవడంతో ఆశ్రమంలో సేవలు చేయడానికి తీసుకొచ్చారు. కానీ ఆశ్రమ నిర్వాహకుడు, స్వామీజీ ఇద్దరు కలిసి ఆమెను లైంగిక వాంఛలు తీర్చుకోవడానికి ఉపయోగించుకున్నారు. మానవత్వం మరిచి చిన్న పిల్ల అని చూడకుండా మీదపడి పశువుల్లా ప్రవర్తించేవారు. దీంతో ఆమె ఎవరికి చెప్పుకోలేక తనలోనే దుఖాన్ని దిగమింగేది. బాలికను గదిలో బందించి నిత్యం అమానవీయంగా చేస్తున్న లైంగిక దాడిపై వెలుగులోకి రావడంతో వారి బాగోతం బట్టబయలైంది.
ఆంధ్రప్రదేశ్ లోని రాజమహేంద్రవరంకు చెందిన బాలిక(15) తల్లిదండ్రులు మరణించడంతో కొద్ది రోజులు బంధువుల ఇంట్లో తలదాచుకుంది. వారు ఆమెను ఆశ్రమంలో చేర్పించడంతో ఆశ్రమ నిర్వాహకుడు పూర్ణానంద స్వామీజీ ఆ బాలికతో పనులు చేయిస్తూ చీకటి పడ్డాక అత్యాచారం చేసేవాడు. ఏడాది నుంచి ఆమె కాళ్లకు సంకెళ్లు వేసి బంధించారు. ఇలా రెండేళ్లుగా ఆమెను చిత్రహింసలకు గురిచేస్తూ తమ కోరికలు తీర్చుకుంటున్నారు.
వారి బారి నుంచి రక్షించుకునేందుకు పనిమనిషి సాయంతో బయట పడిన వారి చిత్రహింసలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలికను విజయవాడలోని దిశ పోలీస్ స్టేషన్ కు పంపారు. పూర్ణానంద స్వామీజీపై ఫోక్స చట్టం కింద కేసు నమోదు చేశారు. తరువాత బాలికను వైద్య పరీక్షల కోసం విజయవాడ పాత ఆస్పత్రికి తరలించారు. పోలీసులు స్వామీజీని అరెస్టు చేశారు.
భక్తి ముసుగులో వారు చేస్తున్న అరాచకం మామూలుగా లేదు. బాలిక అని చూడకుండా పశుత్వంతో వారి కోరికలు తీర్చుకోవడంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. బాలికను లోబరుచుకుని కామవాంఛలు తీర్చుకున్న స్వామీజీని కఠినంగా శిక్షించాలని డిమాండ్లు చేస్తున్నారు. మహిళా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. స్వామీజీ నిర్వాకాన్ని తప్పుబడుతున్నారు.






