24.6 C
India
Wednesday, January 15, 2025
More

    Pushpa 2 The Rule Teaser : ‘పుష్ప2: ది రూల్’ టీజర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్

    Date:

    Pushpa 2 The Rule Teaser
    Pushpa 2 The Rule Teaser Update

    Pushpa 2 The Rule Teaser : అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో రాబోతున్న ‘పుష్ప 2: ది రూల్’ మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఒకటి. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు సినీ విమర్శకులు, అభిమానులు ఈగల్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ తెలుగు స్టార్ తన బ్లాక్ బస్టర్ సినిమా సీక్వెల్ లో ‘డబుల్ ఫైర్’తో తిరిగి వస్తున్నాడని నిర్మాతలు హామీ ఇచ్చారు. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న పుష్ప 2: ది రూల్ టీజర్ విడుదల చేయనున్నట్లు చిత్రబృందం మంగళవారం (ఏప్రిల్ 02) ప్రకటించింది.

    టీజర్ డేట్ అనౌన్స్ మెంట్ పుష్ప అభిమానులను ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీనిపై స్పందించిన ఓ అభిమాని ‘దీని కోసం ఇంకా వేచి ఉండలేను’ అని రాసుకొచ్చాడు. ‘ఇది బ్లాక్ బస్టర్ అవుతుంది’ అని మరొకరు కామెంట్ చేశాడు.

    గతేడాది పుష్ప 2 నుంచి అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలైంది. ఈ పోస్టర్ లో అల్లు అర్జున్ చీర ధరించి నీలం, ఎరుపు రంగు ముఖంతో కనిపించాడు. భారీ సంప్రదాయ బంగారం, పూల ఆభరణాలతో మేకప్ కూడా వేసుకున్నాడు. అంతేకాకుండా పోస్టర్ లో గాజులతో పాటు జుమ్కాలు, ముక్కు పుల్ల ధరించి కనిపించారు.

    సుకుమార్ దర్శకత్వంలో 2021లో విడుదలైన చిత్రం ‘పుష్ప: ది రైజ్’. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచి బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. ప్రస్తుతం వైజాగ్ లో పుష్ప 2 చివరి దశ షూటింగ్ జరుగుతోంది.

    రీసెంట్ గా రష్మిక మందన్న కూడా పుష్ప2 ను టీజ్ చేసి, ఈ సినిమా మునుపెన్నడూ లేనంత పెద్దదిగా ఉంటుందని చెప్పుకొచ్చింది. ‘పుష్ప 2’ భారీ సినిమాగా ఉండబోతోందని మీకు హామీ ఇవ్వగలను. మొదటి సినిమాలో కొంత పిచ్చి చూపించాం, పార్ట్2లో మాపై చాలా అంచనాలు, ఆశలు ఉన్నాయి. మేము వాటిని అందుకునేందుకు నిరంతరం మరియు స్పృహతో ప్రయత్నిస్తున్నాం. ‘పుష్ప 2’ కోసం ఇప్పుడే ఓ పాట షూట్ చేశాను, ‘దీని గురించి మీరెలా ఆలోచిస్తున్నారు?’ అని అడిగాను. మంచి సినిమా తీయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మేమంతా బయటకు వెళ్లి ఈ ప్రక్రియను ఆస్వాదిస్తున్నాం. అంతం లేని కథ ఇది, మీరు దీన్ని ఏ విధంగానైనా నడిపించవచ్చు. ఇది సరదాగా ఉంది’ అని ఆమె ఒక వెబ్ చానల్ తో అన్నారు.

    పుష్ప 2: ది రూల్ లో సమంత రూత్ ప్రభు అతిథి పాత్రలో కనిపిస్తుందని టాక్ వినిపిస్తోంది. సంజయ్ దత్ కూడా ఈ సినిమాలో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. 2024, ఆగస్టు 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

    Share post:

    More like this
    Related

    Nara Lokesh : డిప్యూటీ CM గా నారా లోకేష్.. కూటమి సర్కార్ లో వివాదం పొంచి ఉందా?

    Nara Lokesh : ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి....

    Konaseema : కోనసీమ ప్రభల తీర్థం గురించి తెలుసా?

    Konaseema : సంక్రాంతి వేడుకల్లో నిర్వహించే ప్రభల తీర్థానికి ప్రత్యేక స్థానం ఉంది....

    Brahmani : లోకేశ్ గిఫ్ట్.. రిప్లై ఇచ్చిన బ్రాహ్మణి

    Brahmani : సంక్రాంతి వేళ మంత్రి లోకేశ్ తన భార్య బ్రాహ్మణికి...

    Makara Jyothi : మకర జ్యోతి దర్శనం.. ‘స్వామి’ నామస్మరణతో మార్మోగిన శబరిమల

    Sabharimala Makara Jyothi : సంక్రాంతి పర్వదినం రోజున శబరిమలలో మంగళవారం సాయంత్రం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pushpa 2 The Rule Review : పుష్ప 2 మూవీపై డా.జై గారి రివ్యూ

    Pushpa 2 The Rule Review : అమెరికాలో పుష్ప 2...

    Pushpa 2 Review : పుష్ప 2 రివ్యూ.. హిట్టా? ఫట్టా?

    Pushpa 2 Review : మూడు సంవత్సరాల విరామం తర్వాత, పుష్ప 2:...

    Nagababu vs Allu arjun : అల్లు అర్జున్ కు నాగబాబు వార్నింగ్

    Nagababu vs Allu arjun : మెగా బ్రదర్ , జనసేన...

    Pushpa 2 : అరె ఎంట్రా ఇది.. పుష్ప 2 పై దారుణమైన ట్రోలింగ్స్

    Pushpa 2 Trolls : పుష్ప 2 ట్రైలర్ నిజంగా మెస్మరైజింగ్...