
Pushpa 2 wonders : అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా పుష్ప వండర్ క్రియేట్ చేసింది. బ్రహ్మాండమైన హిట్ సాధించింది. ఈ నేపథ్యంలో పుష్ప2 కూడా శరవేగంగా నిర్మాణం జరుపుకుంటోంది. పుష్ప లాగే పుష్ప 2ను కూడా అంతే వేగంగా నిర్మిస్తున్నారు. దీంతో పుష్ప 2 షూటింగ్ ఎక్కడిదాకి వచ్చిందనే విషయం తెలియడం లేదు. అభిమానులు మాత్రం తమ హీరో సినిమాపై ఆశలు భారీగానే పెట్టుకున్నారు.
అల్లు అర్జున్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావడం లేదు. సినిమా నిర్మాణంలో ఎంతటి సాహస దృశ్యాలైనా చిటికెలో చేసేస్తున్నాడు. సినిమా విడుదల విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. త్వరలో అవుట్ పుట్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నాం. అల్లు అర్జున్ ఇస్తున్న ప్రోత్సాహంతోనే పుష్ప2 వేగంగా నిర్మాణం సాగుతోంది. త్వరలో పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
పుష్ప2కు అద్భుతమైన స్పందన వస్తోంది. దీంతో సినిమా నిర్మాణంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు పుష్ప 2 అంతకు మించి ఉంటుందని అంటున్నారు. ప్రేక్షకుల అంచనాలు కచ్చితంగా అందుకుంటుందని చెబుతున్నారు. అల్లు అర్జున్ కెరీర్ ను మలుపు తిప్పే సినిమాగా పుష్ప 2 నిలుస్తుందని అంటున్నారు.
పుష్ప 2 వ్యాపారం జోరుగా సాగనుంది. హిందీ వెర్షన్ కోసం రూ. 300 కోట్ల ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. పుష్ప 2 పాన్ ఇండియా మూవీగా వండర్ క్రియేట్ చేయబోతోంది. అనుకున్న విధంగా అంచనాలు అందుకుంటే బాక్సాఫీసు వద్ద రూ. వెయ్యి కోట్ల మార్కెట్ ట్ చేసినా ఆశ్చర్య పోనక్కర్లేదని చెబుతున్నారు. ఈ క్రమంలో పుష్ప2 సినిమా ఎంత హిట్ సాధిస్తుందో చూడాలి మరి.






