18.6 C
India
Monday, November 16, 2026
More

    Palnadu TDP : పల్నాడు టీడీపీలో రగడ.. హైకమాండ్ పై పత్తిపాటి గుస్సా

    Date:

    Palnadu TDP
    Palnadu TDP

    Palnadu TDP : ఉమ్మడి గుంటూరు జిల్లా టీడీపీలో ఇంటిపోరు మళ్లీ బయటపడింది. ఒకరిపై ఒకరు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ నేతలు రచ్చకెక్కుతున్నారు. గతంలో సత్తెనపల్లి సీటు విషయంలో సిగపాట్లు పడగా.. ఇప్పుడు చిలకలూరిపేట వంతు వచ్చినట్లుంది. కన్నా లక్ష్మీనారాయణకు సత్తెనపల్లి బాధ్యతలు అప్పగించడంపై కోడెల శివరాం బాహటంగా అభ్యంతరం తెలిపారు. చిలకలూరిపేటలో కూడా తనతో సమాంతరంగా ప్రవీణ్ అనే నాయకుడిని తెరపైకి తేవడంపై పత్తిపాటి పుల్లారావు ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే రాయపాటి రూపంలో అలక, అసంతృప్తిలు ఉండగా.. ఇప్పుడు ఆ రెండు నియోజకవర్గాల్లో అసంతృప్తులు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి.

    గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పత్తిపాటి నియోజకవర్గానికి దూరమైనట్టు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో చిలకలూరిపేట నుంచి టీడీపీ అభ్యర్థిగా కొంత కాలం నుంచి భాష్యం ప్రవీణ్ పేరు వినిపిస్తోంది. నిజానికి పుల్లారావుకు చిలకలూరిపేట కంచుకోట. గతంలో పలుమార్లు ఎమ్మెల్యేగా ఇక్కడి నుంచే గెలుపొందారు. అయితే గత ఎన్నికల్లో తన శష్యురాలు విడదల రజనీ చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి నియోజకవర్గానికి పుల్లారావు దూరంగా హైదరాబాద్‌లోనే ఉంటున్నారని ప్రచారం జరిగింది.  అందుకే ఈసారి హైకమాండ్ భాష్యం ప్రవీణ్‌ను రంగంలోకి దించిందంటూ ఊహాగానాలు వినిపించాయి. దీనిపై పత్తిపాటి ఫైర్ అవుతున్నారు.

    ఇటీవల ప్రవీణ్ పేరు చిలకలూరిపేటలో మార్మోగుతోంది. చంద్రబాబు 73వ పుట్టిన రోజు సందర్భంగా రూ. 73 లక్షలు విరాళం అందజేశారు. దీంతో పాటు భాష్య ప్రవీణ్ పేరిట ఏర్పాటు చేసిన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యువతకు స్వయం ఉపాధికి చేసుకునేందుకు ప్రోత్సాహకాలు అందజేస్తున్నారు. వీధి వ్యాపారులకు టిఫిన్, తోపుడు బండ్లను అందజేయడం, దివ్యాంగులకు ట్రై సైకిళ్ల పంపిణీ. అమరావతి అన్నదాతలకు విరాళం ఇలా అనేక పనులు చేపడుతున్నారు భాష్యం ప్రవీణ్. చిలకలూరిపేట టికెట్ ఆశించే ఆయన ఈ పనులు చేపడుతున్నారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.

    ప్రవీణ్ నిత్యం లోకేశ్ పేరు జపిస్తుండడంతో ఆయన వర్గం వాడని తెలుస్తోంది. దీంతో పుల్లారావు చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేశాడు. ఎన్ని ట్రస్టులు పెట్టినా, ఎంత విరాళం ఇచ్చినా లాభం లేదని, కనీసం అక్కడ ఓటు హక్కు కూడా లేదని దుయ్యబట్టారు. ఫౌండేషన్, ట్రస్టుల పేరుతో వచ్చే వారిని ఎంటర్‌టైన్ చేస్తే ఎలా అని ప్రశ్నించారు. పుల్లారావు చేస్తున్న కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారాయి. పల్నాడు జిల్లాలో టీడీపీ కుమ్ములాటలు పార్టీ శ్రేణులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    Chandrababu : చంద్రబాబుపై దాడి చేసిన వ్యక్తి కథ

    Chandrababu : భారీ ఎన్కౌంటర్లో మరణించిన నక్సలైట్ అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్...

    Chandrababu : చంద్రబాబు గారి సారథ్యంలో రాష్ట్రంలో అభివృద్ధి యజ్ఞం

    Chandrababu : రాష్ట్రంలో ఒక గొప్ప యజ్ఞం నడుస్తోంది. ఆ యజ్ఞ సారథి...

    Chandrababu : ముంతాజ్ హోటల్ భూముల రద్దు: చంద్రబాబు సంచలనం

    Chandrababu : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమలలో కీలక ప్రకటన చేశారు. అలిపిరిలో...