MP Raghuram Comments :
వైసీపీ బహిష్కృత నేత, ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏపీ సీఎం జగన్ పై తరచూ విమర్శలు గుప్పిస్తుంటారు. తను నిర్వహించే “రచ్చబండ” కార్యక్రమంలో మరో సరికొత్త విషయాన్ని వెల్లడించారు. ఇటీవల జగన్ తిరుమల వెళ్లిన సందర్భాన్ని ఉదహరించారు. జగన్ సతీమణి భారతి రెడ్డి ని వెటకారంగా ప్రశంసించారు. గోదావరి జిల్లాలలోని వెటకారాన్ని మరింత అద్దారు.
‘పాపం… భారతిరెడ్డి’ గారికి జగన్ కు వచ్చినంత నటన రాదు. అందుకే ఆమె ఎప్పుడూ తిరుమలను దర్శించరు. తాను చాలా సందర్భాలలో చెప్పానని స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించేటపుడు సతీసమేతంగా విచ్చేయాలని, కానీ ఎప్పుడూ ఈయన ఒక్కరే వస్తారని, వచ్చి తన వింత వింత చేష్టలను చేస్తారంటూ సెటైర్లు వేశారు.
భారతిరెడ్డి ఆమె నమ్ముకున్న దేవుడిని మాత్రమే కొలుస్తారని, అందుకే తిరుమలను ఎప్పుడూ దర్శించరని, ఓ విధంగా అది మంచి విషయమే అని.. ప్రశంసించారు ఎంపీ. అలాగే ఆయన ప్రసాదం తింటారో లేదో తెలియదని, నోటి దాకా వెళ్తుంది గానీ, అది లోపలకి వెళ్తుందో లేదో కూడా తెలియదని, ఈయన మాదిరి భారతికి నటించడం రాలేకపోవడం వలనే తిరుమల రావట్లేదేమోనని ఎద్దేవా అన్నారు.
సహజంగా ప్రత్యర్థి రాజకీయ నాయకుల మహిళలను టార్గెట్ చేయడం వైసీపీ నేతలు, ఆ పార్టీ సిద్ధాంతంగా మారింది. కానీ ప్రస్తుతం తమ పార్టీ ఎంపీ అయిన రఘురామకృష్ణంరాజు , ఏకంగా సీఎం సతీమణి గురించి పేర్కొనడం విశేషం. దీనిపై వైసీపీ నేతలు ఏ విధంగా ప్రతిస్పందిస్తారో చూడాలి. అయితే వైసీపీ నేతలు ఎదురుదాడి బూతులు మినహా మరే విధంగా సంభాషించరన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సారి ఏ విధమైన భాషను వాడుతారో చూడాలి.
ఏపీ రాజకీయాలను ఉద్దేశించి కూడా ఎంపీ రఘురామకృష్ణంరాజు ముఖ్య విషయాలను వెల్లడించారు. చంద్రబాబు అరెస్ట్ కు తోడు ప్రస్తుతం చర్చల్లో నారా లోకేష్, రామోజీరావుల అరెస్ట్ కూడా జరిగితే ఇప్పటివరకు పులివెందులలో గెలుస్తామా? లేదా? అన్నది ఒక ‘డౌట్’ మాత్రమేనని, అది జరిగితే పులివెందుల కూడా ‘అవుట్’ అని దెప్పిపొడిచారు.
ReplyForward
|