Bhola Shankar song release : మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే విడుదలైన థియేట్రికల్ ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మెగాస్టార్ రీ ఎంట్రీ తర్వాత వస్తున్న మూడో రీమేక్ ఇది. ‘ఏకే ఎంటర్ టైన్ మెంట్స్’ నిర్మిస్తున్న ఈ యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్ కు మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ రోజు (ఆగస్ట్ 5)న మేకర్స్ అభిమానులకు సడన్ సర్ప్‌రైజ్ చేశారు. ఈ చిత్రంలోని ‘రేజ్ ఆఫ్ భోలా’ అనే ర్యాప్ సాంగ్ ను సాయంత్రం 4.05 గంటలకు ఆస్కార్ అవార్డ్ గ్రహీత మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ విడుదల చేయనున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ ర్యాప్ సాంగ్ కు మెహర్ రమేశ్ లిరిక్స్ రాశారు.
మరి ర్యాప్ సాంగ్ అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి. చిరంజీవికి సోదరిగా కీర్తి సురేశ్ నటిస్తుండగా, తమన్నా భాటియా హీరోయిన్ గా నటిస్తుంది. సుశాంత్ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. భోళా శంకర్ కు మహతి స్వర సాగర్ సంగీత దర్శకుడు. ఈ సినిమా రిలీజ్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. గతంలో వచ్చిన గాఢ్ ఫాదర్, వాల్తేర్ వీరయ్య అనుకున్న అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలను పెట్టకున్నారు వారు.
కీర్తి సురేశ్ చిరంజీవికి చెల్లెలిగా నటిస్తుండడం ఈ సినిమాకు హైలెట్ గా మారనుంది. దాదాపు ఆగస్ట్ 10వ తేదీ ఉదయం ట్విటర్ టాక్ వచ్చేలా కనిపిస్తుంది. ఇండియాతో పాటు ఓవర్ సీస్ లో కూడా దీన్ని భారీ ఎత్తునరిలీజ్ చేసేందుకు మేకర్స్ కసరత్తు చేస్తున్నారు.