27.9 C
India
Thursday, September 10, 2026
More

    Rahul Gandhi Special Wishes To Mallu Bhatti Vikramarka: భట్టికి ప్రత్యేకంగా ఫోన్ చేసి బర్త్ డే విషెస్ చెప్పిన రాహుల్ గాంధీ !

    Date:

    rahul gandhi special wishes to mallu bhatti vikramarka
    rahul gandhi special wishes to mallu bhatti vikramarka

     

    Rahul Gandhi Special Wishes To Mallu Bhatti Vikramarka: తెలంగాణ ప్రజలు ఎప్పుడూ మరిచిపోలేని దుర్దినాలు… అప్పట్లో చంద్రబాబు పాలనలో ఉండేవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం అరాచక పాలన, కరువుతో అల్లాడిపోయేది. తెలంగాణ కూడా ఇందుకు మినహాయింపు కాదు. నీటి చుక్క లేక జనం అల్లాడుతూ… కన్నీటి చుక్కలతోనే… తమ దాహం తీర్చుకునేటంతటి దుస్థితి! అదుగో అప్పుడు బయలుదేరాడు దివంగత కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి!
    తన మనస్సుల్లాడే స్వచ్ఛమైన తెల్లటి పంచె, దానిపైన సంప్రదాయబద్ధమైన లాల్చీ, నెత్తిన రైతుల్ని తలపించే పాగా, కాళ్లకి స్పోర్ట్స్ షూసు… ఈ రూపం ఎక్కడ కనిపించిన మనకు పెద్దాయనే గుర్తుకు వస్తారు. అటువంటి సందర్భమే మరోసారి వచ్చింది తెలంగాణ నేలపై. అప్పుడు చంద్రబాబు లాగే ఇప్పుడు కేసీఆర్ అరాచక పాలన సాగుతోంది. నీళ్లు, నిధులు, నియామకాలు అన్న తెలంగాణ ప్రజానీకానికి తొమ్మిదేళ్లుగా కన్నీళ్లే మిగిలాయి. వారి చెమర్చిన కళ్లు తుడవటానికే మనందరి జన నేత భట్టి విక్రమార్క పట్టుబట్టి బయలుదేరారు. వేయి కిలో మీటర్లు దాటి వంద రోజుల మైలు రాయిని త్వరలో చేరుకోబోతున్నారు!
    ఆనాటి రాజశేఖర్ రెడ్డి లాగే ఇంటి నుంచీ బయలుదేరి నిర్విరామంగా జనం మధ్య గడుపుతోన్న భట్టికి జూన్ 15న ఆయన బర్త్ డే సందర్భంగా ఒక స్పెషల్ కాల్ వచ్చింది! అది మరెవరి నుంచో కాదు… ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చిన సోనియమ్మ తనయుడు దిల్లీ నుంచీ ఫోన్ చేశారు! భట్టికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన రాహుల్ గాంధీ పాదయాత్ర గురించి అడిగి తెలుసుకున్నారు. గల్లీ నుంచీ దిల్లీ దాకా చర్చగా మారిన పీపుల్స్ మార్చ్… రాహుల్ ను కూడా ఆకర్షించింది. జనం కోసం జన నేత భ్టటి విక్రమార్క చేస్తోన్న పోరాటం ఆయన చేత ఫోన్ చేయించింది. తెలంగాణలో సామాన్య జనం బాగోగుల గురించి ఆరా తీయించింది! ప్రజల కోసం ఆరాటపడుతోన్న నాయకుడికి అండగా కాంగ్రెస్ పార్టీ మొత్తం ఉంటుందని ఆయన అన్నట్లు సమాచారం. మొత్తంగా భట్టి పాదయాత్ర ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్ పార్టీలో చర్చగా మారింది! రాహుల్ నుంచీ ఫోన్ రావటంతో భట్టి విక్రమార్క మరింత ధృఢ సంకల్పంతో ఇక పై ముందుకు దూసుకుపోనున్నారు…

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    YS Sharmila : విజయవాడలో వైఎస్ షర్మిల గృహ నిర్బంధం

    YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల...

    CM Siddaramaiah : లక్ష మంది ముందు ఏఎస్పీపై చేయి చేసుకునేందుకు ప్రయత్నించిన సీఎం సిద్ధరామయ్య – తీవ్ర దుమారం

    CM Siddaramaiah : కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. బెళగావిలో...

    KTR comments : పీసీసీ పదవి రూ.50 కోట్లకు కొన్నాడు.. ఓటుకు నోటు దొంగ” అంటూ రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యాఖ్యలు

    KTR comments : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అధికార, ప్రతిపక్షాల మధ్య...

    Revanth Reddy : బెట్టింగ్ యాప్స్‌పై రేవంత్ సర్కార్ ఉక్కుపాదం.. ఫిర్యాదు కోసం టోల్ ఫ్రీ నంబర్ ఇదే..!!

    Revanth Reddy Sarkar : ఆన్‌లైన్ బెట్టింగ్ వల్ల జరిగే మోసాలు, వాటి...