
Rahul Gandhi : కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మే 31 నుంచి పది రోజుల పాటు అమెరికా పర్యటన చేపట్టనున్నారు. అక్కడ జూన్ 4న ఎన్ ఆర్ఐలతో ర్యాలీ నిర్వహించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. కర్ణాటకలో గెలిచిన ఉత్సాహంలో ఉన్న పార్టీ ఇక దేశంలో కూడా తన ప్రభావం చూపాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే ముందుకు వెళ్తోంది. అమెరికాలో ప్రధాని మోడీ పర్యటనకు ముందే రాహుల్ ర్యాలీ నిర్వహించి బీజేపీకి సవాలు విసరాలని చూస్తున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం.
అమెరికాలోని కాలిఫోర్నియాను సందర్శించనున్ారు. స్టాస్ పోర్డ్ విశ్వవిద్యాలయం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పర్యటనలో అమెరికాలోని పలువురు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలను కలవనున్నారు. అమెరికా పర్యటనలో రాహుల్ గాంధీ బిజీగా గడపనున్నట్లు తెలుస్తోంది.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో ప్రధాని నరేంద్ర మోడీ జూన్ 22న సమావేశం కానున్నారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల గురించి మాట్లాడనున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ పర్యటన కూడా ఉండటంతో ప్రాధాన్యం సంతరించుకుంది. రాహుల్ గాంధీ ఏం మాట్లాడతారు? అమెరికాలో ర్యాలీ ఎందుకు నిర్వహిస్తున్నారనే దాని మీద ఎవరికి స్పష్టత లేదు.
వాతావరణ మార్పులు నుంచి ఆరోగ్య భద్రత వరకు సాధారణ సవాళ్లను ఎదుర్కొనేందుకు కలిసి పనిచేసేందుకు ఇరు దేశాల నేతలు చర్చించనున్నారు. ఈ మేరకు వారి సమావేశంలో చాలా విషయాలు చర్చకు రానున్నాయి. రెండు దేశాల మధ్య పలు విషయాలు చర్చకు వస్తాయని చెబుతున్నారు. ఇప్పుడు ఇద్దరు నేతలు అమెరికాలో పర్యటించడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.