Rahul Gandhi’s Funny Speech :
దేశం మొత్తం పప్పుగా పిలుచుకునే రాహుల్ గాంధీ తన ప్రసంగాలతో మరింత వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో పార్లమెంట్ లో కూడా ఆయన తనను పప్పు అంటుంటారని సభా ముఖంగా ఆవేదన వెళ్లగక్కారు. అయినా కూడా ఆయన ప్రసంగాలను మార్చుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి రెండేళ్ల నుంచి దూరంగా ఉంది. రీసెంట్ గా జరుగుతున్న సర్వేలలో కూడా మరోసారి మోడీ ప్రభుత్వం కొలువుదీరుతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విపక్ష కూటమి ఇండియా (INDIA)ను ఫామ్ చేసింది. ఇందులో కాంగ్రెస్ ఒక ప్రధాన పార్టీగా ఉంటుందే తప్ప అదే లీడ్ రోల్ పోషించే స్థాయిలో లేదు.
దీంతో కాంగ్రెస్ నాయకులకు మింగుడుపడడం లేదు. బీజేపీని ఢీ కొట్టేది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే అన్న మాటను ఇప్పుడు INDIA చెరిపేసేలా కనిపిస్తుంది. దీంతో రాను రాను కాంగ్రెస్ ప్రభ పూర్తిగా కనుమరుగయ్యే ఛాన్స్ లేకపోలేదు. కాంగ్రెస్ పార్టీలో ఛరిష్మా ఉన్న నేతలు తగ్గుతూ వస్తున్నారు. కొందరు మరణించగా.. మరికొందరు రిటైర్ మెంట్ తీసుకున్నారు. దీంతో కాంగ్రెస్ రాను రాను కనుమరుగయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. ఇక సర్వేలు నిజమై మరో ఐదేళ్లు బీజేపీ కొలువు దీరితే ఇక కాంగ్రెస్ ను పట్టించుకునే నాథుడే కరువయ్యేలా కనిపిస్తుంది.
కాంగ్రెస్ పార్టీకి వారసత్వ నాయకుడు రాహుల్ గాంధీ. ఆయన పార్టీ శ్రేణులను ఉత్తేజ పరచడంలో ప్రతీసారి విఫలం అవుతున్నారన్న వార్తల్లో నిజం లేకపోలేదు. ఆయన ఇచ్చే ప్రసంగాలు సైతం పేలవంగా నవ్వు తెప్పిస్తుంటాయి. ఆయన ఒక సభలో ప్రసంగించిన తీరును వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసి ఆయనా భారతదేశానికి మార్గ దర్శనం చేసే లీడర్? అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఆయన ఏమన్నారంటే.
ఒక భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాటలు నవ్వు తెప్పించేలా అనిపించాయి. పైన తిరిగే గ్రద్ధలను చూపుతూ ‘ఇవి గ్రద్దలు ఇక్కడ ఎందుకు తిరుగుతున్నాయో తెలుసా.. ఇవి ఇక్కడ ఏం చేస్తున్నాయి.. ఇక్కడ ఎందుకు తిరుగుతున్నాయి.. వాటికి ఉపాధి లేదు. దీనికి కారణం నరేంద్రమోడీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ’ అన్నాడు. ఇది ప్రస్తుతం నవ్వు తెప్పిస్తుంది.