
Rahul meeting with NRIs : కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్ గాంధీ జూన్ మొదటివారంలో అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ ఎన్ఆర్ఐలతో జూన్ 4న కీలక సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. సుమారు 5000 మంది ఎన్ఆర్ఐలతో ఆయన ముఖాముఖి సమావేశం కానున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే న్యూయార్క్ లో పూర్తయ్యాయి.
అయితే రాహుల్ గాంధీ సెక్యూలర్ డెమోక్రటిక్ ఇండియా పేరిట అమెరికాలోని ఎన్ఆర్ఐలతో సమావేశం కాబోతున్నారు. భారత్ లో ప్రస్తుత పరిస్థితులు, అద్భుత భారత్ నిర్మాణానికి ఎలా ముందుకెళ్లాలనే అంశంపై ఆయన వారితో చర్చించనున్నారు. ఎన్నికలకు మరో ఏడాది గడువు మాత్రమే మిగిలి ఉండడం, ఇప్పుడు ముందున్నదంతా రాహుల్ కు పెద్ద పరీక్ష. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఆయన చేయాల్సిందంతా చేస్తున్నారు.

ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఆయన చేపట్టిన భారత్ జోడో యాత్ర కు అనూహ్య స్పందన వచ్చింది. దాని ఫలితాలు కర్ణాటకలో చూశామని ఆ పార్టీ శ్రేణులు ఇప్పటికే చెబుతున్నారు. అయితే రాహుల్ అక్కడి ప్రవాస భారతీయులు, పారిశ్రామిక వేత్తలను కలిసి మాట్లాడనున్నారు.
అయితే రాహుల్ గాంధీ జూన్ 4న అక్కడి ప్రవాస భారతీయుల ర్యాలీలో పాల్గొన్న అనంతరం వారిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దీంతో పాటు పలువురు పారిశ్రామిక వేత్తలతో కూడా రాహుల్ సమావేశం కానున్నట్లు సమాచారం. స్టాన్ ఫార్డ్ యూనివర్సిటీలోనూ అక్కడి విద్యార్థులతో రాహుల్ మాట్లాడనున్నారు. ఆయన ప్రసంగానికి యూనివర్సిటీ ఏర్పాట్లు చేసింది. అయితే రాహుల్ తో ప్రవాస భారతీయుల సమావేశమే ఇప్పుడు కీలకమని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. మరోవైపు ఇదే సమయంలో భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటన కూడా ఖరారైంది.