
Rajagopal : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు గుర్తుండే ఉంటుంది. మునుగోడులో ఓటమి పాలైన నేత. కాంగ్రెస్ పార్టీ నుంచి మునుగోడు నియోజకవర్గం నుంచి గెలిచిన ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడి తీరు నచ్చక పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఏ పార్టీలో చేరాలని చూస్తున్న సమయంలో అప్పటి ఊపుమీదున్న బీజేపీని ఎంచుకున్నారు రాజగోపాల్ రెడ్డి. ఇంకేముంది యాజ్ టీజ్ ఈటల రాజేందర్ స్టోరీ ఇక్కడ కూడా అప్లయ్ చేద్దామని అనుకున్నారు.
మొదట కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన ఆయన తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. బీజేపీలో చేరి మళ్లీ ప్రజా క్షేత్రంలోకి వెళ్లాలని అనుకున్నారు. ఎన్నికల కమిషన్ కూడా అక్కడ ఎన్నికలు నిర్వహించింది. కేసీఆర్, ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ మునుగోడులో దించి రాజగోపాల్ రెడ్డిని ఓడించింది. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం ఆయన సొంత గూటికి వెళ్లాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక గెలుపుతో మంచి ఊపుమీదున్న కాంగ్రెస్ ఈ ఏడాది చివరలో జరిగే ఎన్నికల్లో ఇదే ఊపును కొనసాగిస్తుందిన కొన్ని సర్వేలు తెలుపుతుండడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కర్ణాటక స్టేట్ లో ప్రభుత్వంలో ఉండి కూడా ఓటమి పాలైంది బీజేపీ. ఇక్కడ ఇంత వరకూ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందే లేదు. అందునా కాంగ్రెస్ తో పోల్చుకుంటే పెద్ద కేడర్ కూడా లేదు. ఇందులోనే ఉంటే వచ్చే ఎన్నికల్లో ఇబ్బంది పడతామని భావించిన రాజగోపాల్ రెడ్డి సొంత గూటికి వెళ్లాలని చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే రేవంత్ రెడ్డి క్షమాపన చెప్తే బాగుంటుందని కాంగ్రెస్ పార్టీలోని కొందరు సీనియర్ నాయకుల వద్ద అన్నట్లు వినికిడి.
బీజేపీలో చేరికల సారధి ఈటల రాజేందర్ ఎలాంటి పనులు చేయడం లేదని. ఆయనకు నాయకత్వం అప్పగించినా పరిస్థితిలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చని రాజగోపాల్ భావిస్తున్నారట. రాను రాను మోడీ గ్రాఫ్ పడిపోతుందని, ఒక వేళ ఉన్నా అది పార్లమెంట్ ఎన్నికల వరకే ఉపయోగపడుతుందని అనుకుంటున్నారట రాజగోపాల్. కర్ణాటక ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్ రాజగోపాల్ గర్ వాపసీకి సమ్మతిస్తుందా అన్నదానిపై భిన్న కథనాలే వినిపిస్తున్నాయి.