Rajamouli Watching Devara : ‘దేవర’ మూవీ ఎట్టకేలకు థియేటర్స్ లో రిలీజ్ అయింది. నందమూరి ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న జూనియర్ ఎన్టీఆర్ మూవీ థియేటర్లలో రిలీజ్ కాగా.. ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. ఇప్పటికే మిడ్ నైట్ షోతో నార్త్ అమెరికాలో రికార్డులు క్రియేట్ చేసింది. కాగా రిలీజ్ రోజు అన్ని షోలు థియేటర్లలో హౌస్ ఫుల్ అయ్యాయి. కాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేవరలో ఆయన క్యారెక్టర్ కు ఫిదా అయ్యారు. కాగా సినిమాలో విజువల్ వండర్స్ కు ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్టీఆర్ రెండు క్యారెక్టర్లతో మంచి పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటున్నాడు. సెలబ్రెటీల్లో చాలా మంది దేవర సినిమా ఎర్లీ మార్నింగ్ షోలకు హాజరై సినిమాను ఎంజాయ్ చేశారు. సినీ దర్శకుడు రాజమౌళి తన ఫ్యామిలీతో కలిసి దేవర మూవీని థియేటర్ లో చూశారు.
బాలానగర్ లోని ఓ థియేటర్ కు ఫ్యామిలీతో సహా అందరూ కలిసి వెళ్లి హాజరయ్యారు. కాగా ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. కాలభైరవ, శ్రీసింహ కేకలు వేస్తూ థియేటర్స్ లో సందడి చేశారు. కాగా సినిమా చూస్తున్న సమయంలో మహేశ్ బాబు ఫ్యాన్స్ కూడా ఎంజాయ్ చేశారు. మహేశ్ బాబు సినిమా అప్డేట్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరగా.. రాజమౌళి చిరునవ్వుతోనే సమాధానం చెప్పాడు. రాజమౌళి కొడుకు కార్తీకేయ ట్విటర్ లో మూవీపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు.
రాజమౌళి సెంటిమెంట్ కి ‘దేవర’ తో ఎన్టీఆర్ బ్రేక్ వేశాడన్నారు. రాజమౌళి ‘స్టూడెంట్ నెంబర్ 1’ సినిమాతో ఎన్టీఆర్ మంచి సక్సెస్ ఆ తర్వాత వచ్చిన సుబ్బు మూవీ ఫెయిల్ అయింది. ఇలా నితిన్ కు సై మూవీ తర్వాత ఫెయిల్, ప్రభాస్ కు చత్రపతి తర్వాత ఫెయిల్ వచ్చాయి. అయితే ఈ విధానాన్ని ఈ సారి జూనియర్ ఎన్టీఆర్ తిప్పికొట్టేశాడు. ఆర్ ఆర్ ఆర్ తర్వాత దేవర తో భారీ హిట్ కొట్టాడు. డైరెక్టర్ కొరటాల శివకు కూడా ఆచార్య డిజాస్టర్ తర్వాత దేవర హిట్ టాక్ రావడంతో సంబరాల్లో మునిగిపోయారు.
@ssrajamouli 👀 pic.twitter.com/XLbkoHzYwS
— Ahaa Aditya (@ahaa_aditya) September 27, 2024