
Rajamouli : మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న SSMB 29 సినిమాకు సీక్వెల్ ఉండదట. సినిమా మొత్తం ఒకే భాగంలో చెప్పాలని రాజమౌళి నిర్ణయించుకున్నారని సమాచారం. ‘ఆర్ఆర్ఆర్’ తరహాలోనే ఈ సినిమా కూడా నిడివి ఎక్కువగా ఉంటుందట. బలమైన కథ, మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సన్నివేశాలతో సినిమా ప్రేక్షకులను ఆద్యంతం కుర్చీలకు అతుక్కుపోయేలా చేస్తుందని రాజమౌళి భావిస్తున్నారట. అందుకే ఈ సినిమాకు రెండో భాగం ఉండదని తెలుస్తోంది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.