
Rajamouli : దర్శకుడు రాజమౌళికి మహేష్ బాబు నటించిన సినిమాల్లో ‘ఒక్కడు’ మరియు ‘పోకిరి’ అంటే చాలా ఇష్టమట. ఈ రెండు సినిమాలతోనే మహేష్ బాబు స్టార్ హీరోగా ఎదిగారు. ఆ సినిమాల్లో మహేష్ బాబు నటన రాజమౌళిని ఎంతగానో ఆకట్టుకుందట. అప్పటినుంచే ఆయనతో సినిమా చేయాలని అనుకుంటున్నప్పటికీ, అది ఇప్పుడే కార్యరూపం దాల్చిందని రాజమౌళి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.