23.8 C
India
Wednesday, August 12, 2026
More

    RajaMouli VS VanuMadhv : వేణుమాధవ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా జక్కన్న.. ఏం క్రియేటివిటీరా బాబూ..

    Date:

    Rajamouli VS VanuMadhav
    Rajamouli VS VanuMadhav

    RajaMouli VS VanuMadhv : రంగుల ప్రపంచంలో గాసిప్ లకు కొదువ లేదు. ఫలానా హీరోతో హీరోయిన్.. ఫలానా హీరోయిన్ హీరో ఇలా ప్రతీ ఒక్కటి ఒకదానికి ఒక దానికి పూర్తి లంకె ఉండదు. అయినా గాసిప్ రాయుళ్లు వాటిని కలుపుతూ మంచి స్టోరీ క్రియేట్ చేస్తారు. ఈ మధ్య వచ్చిన ఒక ఫొటో, వీడియో వైరల్ గా మారింది. దివంగత కమేడియన్ వేణు మాధవ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా రాజమౌళి పని చేశాడని అసలు ఈ క్రియేటివ్ థాట్ ఎలా వచ్చిందిరా బాబూ.. అదేంలో చూద్దాం

    రాజమౌళి గురించి అందరికీ తెలిసిందే. ఆయన సినిమాలకు ఇండియా మార్కెట్ లోనే కాదు.. విదేశీ మార్కెట్ లో మంచి క్రేజ్ ఉంది. ఆయన తీసిన సినిమాల్లో ఇప్పటి వరకు డిజాస్టర్ సినిమానే లేదంటే అతిశయోక్తి కాదు. తీసిన ప్రతీ సినిమా కూడా సినీ ప్రపంచాన్ని ఒక్క కుదుపు కుదుపుతుంది. ‘సై’తో స్టూడెంట్ పవర్ చూపిన ఆయన ‘యమదొంగ’తో చిలిపి దొంగను చూపించారు. ఇక బాహుబలి గురించి చెప్పనవసం లేదు. ‘ఆర్ఆర్ఆర్’ సాధించిన ఘటన ఎన్నటికీ మరిచేది కాదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో.. మరెన్నో.

    రాజమౌళిలో ఒకే లోపం కనిపిస్తుంది. అదేంటంటే.. సినిమాలను సంవత్సరాలకు సంవత్సరాలు తీయడం. అంటే అమరశిల్పి జక్కన్న లాగా చెక్కుతూ పోతుంటారు రాజమౌళి. అందుకే ఆయన సినిమాల్లో భూతద్దం పెట్టి వెతికినా ఫాల్ట్ అనేది కనిపించదు. ప్రతీ సీన్ కొత్తగా, ఆకట్టుకునేలా కనిపిస్తుంది. అందుకే ఆయన ఇంటర్నేషనల్ డైరెక్టర్ గా మారాడు. అయితే, ఇటీవల ఆయన గురించి ఒక ఆసక్తి కరమైన న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే వేణుమాధవ్ వద్ద రాజమౌళి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారని. ఇది వైరల్ రాయుళ్లు క్రియేట్ చేసిందే. అయితే రాజమౌళి గతంలో అంటే ఇండస్ట్రీకి రాక ముందు సీరియల్స్ కు దర్శకత్వం వహించారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇక వేణుమాధవ్ మాత్రం ఇప్పటి వరకు మెగాఫోన్ పట్టుకున్న సందర్భం లేదు. మరి ఈ వైరల్ న్యూస్ ఎలా స్ర్పెడ్ చేయగలిగారు.

    రాజమౌళి తీసిన బ్లాక్ బస్టర్ సినిమా ‘సై’. ఇందులో నల్లబాలు పాత్రలో వేణుమాధవ్ కనిపిస్తాడు. గోడలపై పెయింటింగ్స్ వేయించడం ఆయన చేసే పని. కాలేజీ గోడలపై పేయింటింగ్ వేసే సీన్ లో నల్లబాటు ఒకరికి డైరెక్షన్స్ ఇస్తాడు అతడే రాజమౌళి. ఈ సినిమాకు ఆయనే డైరెక్టర్. ఈ సీన్ కూడా తక్కువ నిడివే ఉంటుంది. (అంటే కొన్ని సెకండ్ల పాటే) దీంతో వేణుమాధవ్ కు అసిస్టెంట్ డైరెక్టర్ అంటూ క్రియేట్ చేశారు వైరల్ రాయుళ్లు. వాళ్లు ఏది క్రియేట్ చేసినా ఇప్పుడది తెగ వైరల్ గా మారింది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related