Rajendranagar Ground Report :
అసెంబ్లీ నియోజకకవర్గం: రాజేంద్రనగర్
బీఆర్ఎస్: తొలకంటి ప్రకాశ్ గౌడ్
కాంగ్రెస్: జ్ఞానేశ్వర్
బీజేపీ: తోకల శ్రీనివాస్ రెడ్డి
రంగారెడ్డి జిల్లాలోని నియోజకవర్గంలో ఒకటి రాజేంద్రనగర్. ఇది చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లోని 24 నియోజకవర్గా్ల్లో ఇదీ ఒకటి. 2007 డీలిమిటేషన్ లో భాగంగా ఈ నియోజకవర్గం ఆవిర్భవించింది. గతంలో కాటేదాన్ చేవెళ్ల, చార్మినార్ నియోజకవర్గాల పరిధిలో ఉన్న ప్రాంతాన్ని ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ విమానాశ్రయం, వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ నియోజకవర్గపు ప్రత్యేకతలు.ఇందులో మూడు మండలాలు ఉన్నాయి. అవి 1. రాజేంద్రనగర్, 2. శంషాబాద్, 3. గండిపేట. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా తొలకింటి ప్రకాశ్ గౌడ్ ఉన్నారు.
ఈ నియోజకవర్గం మొదటి నుంచి టీడీపీకి కంచుకోటగా ఉండేది. 2007లో ఈ కానిస్టెన్సీ ఆవిర్భవించగా 2009లో దీనికి మొదటి సారి ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి వరుసగా ప్రకాశ్ గౌడ్ గెలుస్తూ వస్తున్నారు. 2014, 2018. హ్యట్రిక్ ఎమ్మెల్యేగా ఆయన మంచి గుర్తింపు దక్కించుకున్నారు. అయితే రెండు సార్లు (2009, 2014) టీడీపీ తరుఫున పోటీ చేసిన గెలిచిన ఆయన 2018లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. ఈ నియోజకవర్గంలో సుమారు 4,40,000 మంది ఓటర్లు ఉన్నారు.
బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్
ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కు రాజేందర్ నగర్ లో భారీగా పట్టు ఉంది. రెండు సార్లు టీడీపీ నుంచి, ఒకసారి టీఆర్ఎస్ నుంచి గెలిచిన ఆయన హ్యాట్రిక్ విజయం సాధించాడు. మూడు సార్లు గెలిచినా నియోజకవర్గంలో అభివృద్ధి అంతంతే అంటూ నియోజకవర్గం వ్యాప్తంగా అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ ప్రధానమైన సమస్యలు అలాగే ఉన్నాయని ప్రతిపక్ష నాయకుల నుంచి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఈ సారి కూడా బీఆర్ఎస్ టికెట్ ఆయనకే కేటాయించినా గెలుపు విషయానికి వస్తే టఫ్ గానే ఉంటుందని వాదనలు వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్
రాజేంద్రనగర్ లో నిలబెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థి కోసం ఎదురుచూస్తోంది. తమకే టికెట్ ఇవ్వాలని జ్ఞానేశ్వర్, కస్తూరి నరేందర్, గౌరీ సతీశ్ తో పాటు మరో మహిళా నేత దరఖాస్తు చేసుకుంది. అయితే అధికార పార్టీని బలంగా ఢీ కొనాలంటే ఆర్థికంగా కూడా కలిసి వచ్చే అభ్యర్థిని హస్తం పార్టీ వెతుకుతోంది. ఈ పార్టీకి ఇక్కడ మంచి ఓటు బ్యాంకే ఉన్నా.. దాన్ని వాడుకోవడంలో మత్రం ఇప్పటికీ నేతలు వెనుకబడుతూనే ఉన్నారు.
ఎంఐఎం
రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ముస్లింల ఓటు బ్యాంకు ఎక్కువే ఉంది. 4,40,000 ఓటు బ్యాంకులో 1,32,000 ముస్లిం ఓట్లు ఉన్నాయి. గతంలో 3వ స్థానానికి పరిమితమైన ఎంఐఎం ఈ సారి అభ్యర్థిని నిలిపేందుకు సన్నాహాలు చేస్తుంది. బీఆర్ఎస్ తో ఇప్పటి వరకు కలిసి పోటీ చేస్తున్న ఎంఐఎం ఈ సారి మాత్రం అభ్యర్థిని రంగంలోకి దింపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల శాస్త్రీపురంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
బీజేపీ
ఎంఐఎం బరిలో నిలిస్తే భారతీయ పార్టీ దానికి తగ్గట్లు అభ్యర్థిని అన్వేషిస్తుంది. ఇప్పటికే ఈ నియోజకవర్గం నుంచి తోకల శ్రీనివాస్ రెడ్డి దరఖాస్తు సమర్పించారు. బీజేపీకి ఇక్కడ ఆశించిన స్థాయిలో ఓటు బ్యాంకు లేదు. కానీ ఎంఐఎం నిలబడితే మాత్రం హిందూ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఇదే జరిగితే వార్ బాజేపీ, ఎంఐఎం మధ్యనే ఎక్కువ ఉండవచ్చన్న వాదనలు కూడా లేకపోలేదు.