Rajinikanth – Chiranjeevi : ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్, మెగాస్టార్ చిరంజీవి ఇద్దరు కూడా లెజెండరీ నటులు అనే చెప్పాలి.. మరి ఈ ఇద్దరు వందల సినిమాలు చేశారు.. అందుకే ఇద్దరికీ వీరాభిమానులు ఉన్నారు.. టాలీవుడ్ ను మెగాస్టార్ ఎలాగైతే ఏలుతున్నాడో అలాగే కోలీవుడ్ ఇండస్ట్రీని రజినీకాంత్ కూడా అలాగే ఏలుతున్నాడు..
ఈ ఇద్దరు స్టార్స్ కూడా ఇప్పటికి సినిమాలు చేస్తూ ఈ వయసులో కూడా పోటీ పడుతున్నారు.. మరి ఈ ఇద్దరు స్టార్స్ చాలా ఏళ్ల తర్వాత బాక్సాఫీస్ దగ్గర ఒక్కరోజు తేడాతో పోటీకి సిద్ధం అయ్యారు.. ఈ క్రమంలోనే వారి అభిమానులు ఈ ఇద్దరి స్టార్స్ మధ్య అనుబంధం, జరిగిన చేదు ఘటనల గురించి గుర్తు చేసుకుంటున్నారు..
ఇద్దరి స్టార్స్ కలిసి నటించిన మూవీ తాయారమ్మ బంగారయ్య సినిమా 1979లో రిలీజ్ అయ్యింది.. ఈ సినిమాలో చిరు పూర్తి స్థాయిలో నటించక పోయిన ఇద్దరు నటనకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు.. వీరిద్దరూ ఒకరిపై ఒకరు స్నేహబంధాన్ని కొనసాగిస్తున్న రోబో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రజినీకాంత్ నన్ను ఒక విషయంలో మోసం చేసారు.. ఆయన రాజకీయాల్లోకి వస్తారేమో అనుకుని నేను పాలిటిక్స్ లోకి వెళ్ళాను..
కానీ ఆయన రాజకీయాల్లోకి రాకుండా నన్ను మోసం చేసారు.. రోబో సినిమా చేసి సడెన్ షాక్ ఇచ్చారు.. నేను ఒకవేళ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా రోబో సినిమా ఇన్స్పిరేషన్ గా తీసుకుంటా అంటూ తెలిపారు చిరు.. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.. ఇక ఈ రోజు రజిని జైలర్ రిలీజ్ అవ్వగా.. రేపు చిరంజీవి భోళా శంకర్ రిలీజ్ కానున్నాయి. మరి ఈ రెండు సినిమాలు ఎలా ఆకట్టు కుంటాయో వేచి చూడాలి..