Rajinikanth : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ సినిమాలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను టార్గెట్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. సినిమాలో డైలాగులతో సెటైర్లు వేశారు. గతంలో చంద్రబాబు విజన్ గురించి గొప్పగా చెప్పడంతో విమర్శలు చేసిన వైసీపీ నేతలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. చెన్నైలో జరిగిన ఆడియో రిలీజ్ వేడుకలో తిట్టని నోరు విమర్శించని ఊరు లేదని చెబుతుండటం విశేషం.
సినిమాలో ఏపీలోని వివాదాస్పద అంశాలను తీసుకుని డైలాగులు రాయడం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే రజనీకాంత్ కొద్ది నెలల క్రితం ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేతలు రియాక్ట్ అయి విమర్శలు చేశారు. మంత్రి రోజా కూడా రజనీపై విమర్శలు చేయడం గమనార్హం. దీంతో అప్పటి నుంచి రజనీ వైసీపీ నేతల మధ్య దూరం పెరిగినట్లు తెలుస్తోంది.
తాజాగా జైలర్ సినిమాలో ఆంధ్ర ఎమ్మెల్యేలు, ఎంపీల గురించి సీన్లు ఉండటం ఆసక్తి రేపుతోంది. తీహార్ జైలులో రజనీకాంత్ విధులు నిర్వహిస్తున్న సమయంలో ఎదురు తిరిగిన ఓ రౌడీ ఎదురు తిరుగుతాడు. జైలులో నిబంధనలు పాటించకపోతే ఎవరికైనాశిక్ష తప్పదని హెచ్చరిస్తాడు. ఆంధ్రకు ఒక్క ఫోన్ కొడితే నీ కుటుంబం నాశనం అవుతుందని హెచ్చరిస్తాడు.
జైలులో రౌడీ హెచ్చరికలకు భయపడకుండా చేతిలో ఫోన్ పెట్టి ఏపీలో ఉన్న 30 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలకు ఫోన్ చేసుకో. ఏం చేస్తారో చేసుకో అంటూ జైలర్ సవాలు విసురుతాడు. రౌడీ ఫోన్ చేసి ఏదో చేసే లోపే జైలర్ ఇచ్చిన షాక్ అదరగొట్టేలా ఉంటుంది. ఇలా రాజకీయాలను టార్గెట్ చేసుకుని రజనీ సినిమా ఉండటం విశేషం. మొత్తానికి జైలర్ ఏపీ రాజకీయాలను ఫోకస్ చేస్తుందని అంటున్నారు.