Pawan -Rajinikanth
సూపర్ స్టార్ రజినీకాంత్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి.. ఈ కామెంట్స్ తో సోషల్ మీడియా వేడెక్కింది.. ‘జైలర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రజినీకాంత్ ఎవరికో కౌంటర్ వేశారని అది పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి చేసారని అంటున్నారు.. ఇంతకీ రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలు ఏంటి? అది పవన్ కు ఏంటి సంబంధం అంటే?
బ్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ తమిళ్ ఇండస్ట్రీ గురించి వ్యాఖ్యలు చేసారు. సినీ పరిశ్రమ అంటే ఎవ్వరినైనా ఆహ్వానించాలి.. బాష, ప్రాంతీయ బేధాలు లేకుండా టాలెంట్ ను మాత్రమే చూస్తేనే అప్పుడే సినీ పరిశ్రమ ఎదుగుతుంది అని తమిళ్ ఇండస్ట్రీలో తమిళ్ నటులు, సాంకేతిక నిపుణులే ఉండాలని అనుకోవడం తప్పని దీని వల్ల పరిశ్రమ వెనుకబడి పోతుంది.. అని అన్నారు.
అలాగే తమిళ్ ఇండస్ట్రీ తమ వైఖరిని మార్చుకోవాలంటూ పవన్ కోలీవుడ్ పై చేసిన విమర్శలు అక్కడ స్టార్స్ ను హర్ట్ చేశాయని వారు చేసే కామెంట్స్ తోనే అర్ధం అవుతుంది.. ఇప్పటికే నాజర్ వంటి నటుడు ఈ వ్యాక్యలపు స్పందించారు. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ సైతం పవన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ఈయన ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ.. ”విమర్శించేవాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు.. మనం పట్టుంచుకోకుండా పోవడమే అన్నట్టు రజిని వ్యాఖ్యలు చేసారు.. మొరగని కుక్కలేదు… విమర్శించని నోరు లేదు… ఈ రెండు జరగని ఊరు లేదు.. మనం మన పని చేసుకుంటూ పోతానే ఉండాలి.. అర్ధం అయిందా రాజా.. అంటూ ఈయన చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట చర్చకు దారి తీశాయి.. ఇది తమిళ్ ఇండస్ట్రీ పై పవన్ కామెంట్స్ కు రజినీకాంత్ కౌంటర్ అని అంతా అంటున్నారు.