- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో

Rakesh Master Dance Lessons : రాకేష్ మాస్టర్ మరణవార్తతో టాలీవుడ్ దిగ్భ్రాంతికి గురైంది. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 1500 సినిమాలకు కొరియోగ్రఫీ చేసిన రాకేష్ మాస్టర్ టాలీవుడ్ టాప్ హీరోలందరికీ కొరియోగ్రఫీ చేశాడు. తన డ్యాన్స్ స్కూల్ లో కొందరికి శిక్షణ కూడా ఇచ్చాడు. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్లు శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ కూడా రాకేష్ మాస్టర్ శిష్యులే.
సోషల్ మీడియాస్టార్ గా రాకేష్ మాస్టర్..
ఆట, ఢీ షోలలో కనిపించిన రాకేష్ మాస్టర్ కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. జబర్దస్త్ లాంటి కామెడీ షోలలో కూడా పాల్గొన్నాడు. రాకేష్ మాస్టర్ యూట్యూబ్ ఇంటర్వ్యూలలో టాలీవుడ్ సెలబ్రిటీలపై చేసిన వ్యాఖ్యలు ఆయన కెరీర్ ను కొంత వరకు దెబ్బతీశాయి. ఆయన ఇంటర్వ్యూల కోసం యూట్యూబ్ చానెళ్లు వెంటపడ్డాయి. ఆయన ఇంటర్వ్యూలతో ఆయా చానెళ్లు వ్యూయర్ షిప్ సాధించుకున్నాయి. ఆ తర్వాత ఆయన ఏం మాట్లాడినా వైరల్ గా మారింది. శ్రీకృష్ణుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రాకేష్ మాస్టర్‌పై యాదవ సంఘాలు కేసులు పెట్టాయి.
రెబల్ స్టార్ కు డ్యాన్స్ పాఠాలు..
అయితే రాకేష్ మాస్టర్ కు సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. పాన్ ఇండియా స్టార్‌గా మారిన రెబల్ స్టార్ ప్రభాస్‌కు రాకేష్ మాస్టర్ డ్యాన్స్ లో ఓనమాలు నేర్పించాడు. సినిమాల్లోకి వచ్చే ముందు ప్రభాస్ రాకేష్ మాస్టర్ దగ్గర శిష్యరికం చేశాడు. ప్రభాస్ తో చాలా మంది ప్రస్తుత టాలీవుడ్ యంగ్ హీరోలు అతని దగ్గర డ్యాన్స్ లో శిక్షణ పొందిన వారే కావడం గమనార్హం.






