
Rakesh Master life : 1500 సినిమాలు, ఎన్నో షోలు, గ్రేట్ డాన్స్ మాస్టర్, సెలబ్రెటీలకే సెలబ్రెటీ, వందలాది మంది శిష్యులు పాన్ ఇండియా రేంజ్ లో స్టెప్పులు.. కట్ చేస్తే మెగాస్టార్ చిరంజీవితో వివాదం, రామ్ గోపాల్ వర్మతో లొల్లి, శ్రీరెడ్డితో గొడవ ఇక మరో కోణం శిష్యులతో మిస్ బిహేవియర్.. అగ్రెసివ్ పర్సన్.. ఇవన్నీ వేరు వేరు వ్యక్తిలోనికి అనుకుంటే పొరబాటే మరి. ఇవన్నీ ఒకే వ్యక్తిలోనివి. ఎమోషన్స్ ఉంటే ఉండచ్చు. కానీ అవి ఎక్కడ..? ఎప్పుడు..? ఎలా..? వాడాలో తెలిసిన వాడే మేథావి. ఆ కోవలోకి వచ్చే వారి గురించి తెలుసుకున్నాం కానీ ఆ కోవలోకి రాని వారి గురించి చెప్పుకోవాలంటే ఆయనే రాకేశ్ మాస్టర్.
ఇండస్ట్రీకి పరిచయం అక్కర్లేని పేరు రాకేశ్ మాస్టర్. ఆటా, ఢీషోలతో వెలుగులోకి వచ్చిన రాకేశ్.. తర్వాత అనేక సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేశాడు. దీనికి ముందు డాన్స్ క్లాసులు చెప్పుకుంటూ రూ.5 వేలు, రూ.10 వేలు సంపాదించే రాకేశ్ తర్వాత గొప్ప డ్యాన్స్ మాస్టర్ అయ్యాడు. సుమారు 1,500 సినిమాలకు కొరియోగ్రాఫీ చేశాడు. ఎంత వేగంగా ఎదిగాడో.. అంతే వేగంగా పతనమయ్యాడు. చినిపోయేప్పటికి ఆస్తులు, పేరు, గుర్తింపు అన్నీ పోగొట్టుకొని ఇండస్ట్రీలో అనాథలా మారి తనువు చాలించాడు.
జీవితం అంతా కష్టాలే..
1968లో తిరుపతిలో జన్మించిన రాకేశ్ మాస్టర్ అసలు పేరు ఎస్ రామారావు. ఆయన తల్లిదండ్రులకు ఏడుగురు సంతానం అందులో వీరు కింది నుంచి రెండో వాడు. ఆయనకు నలుగురు అక్కలు, ఒక అన్న, ఒక తమ్ముడు ఉన్నారు. డాన్స్ అంటే ఆయనకు చిన్నప్పటి నుంచి పిచ్చి హైదరాబాలోని ముక్కు రాజు మాస్టర్ వద్ద శిష్యరికం చేశాడు. అనతి కాలంలోనే మంచి కొరియోగ్రాఫర్ గా పరిణతి పొందాడు. వేణు, ప్రభాస్, హరికృష్ణ ఇలా టాప్ స్టార్లకు ఆయన కొరియోగ్రఫీ చేశాడు. ఆయన జీవితంలో శేఖర్ మాస్టర్, జారీ మాస్టర్ లాంటి అగ్ర కొరియోగ్రాఫర్లను కూడా తయరు చేశారు.
వారంతా ఆయన శిష్యులే..
ఇండస్ట్రీకి మెరికల్లాంటి కొరియోగ్రాఫర్లను తయరు చేశాడు రాకేశ్ మాస్టర్. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ ఆయన శిష్యులే. తన అభిమాన శిష్యుడైన శేఖర్ మాస్టర్ తో చాలా సార్లు కాంట్రవర్సీ పెట్టుకున్నారు రాకేశ్ మాస్టర్. అయినా గురువని ఆయన అభిమానించేవారు. వీరితో పాటు చాలా మంది ఆయన వద్ద శిష్యరికం తీసుకున్నారు. ఎన్ని గొడవలు వచ్చినా వారంతా రాకేశ్ మాస్టర్ వెంటే ఉండేవారు. ఆయన శిష్యులమని గొప్పగా చెప్పుకున్నారు.
ప్రభుదేవా సమక్షంలోనే..
ఫేమస్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతోనే ఆయన కాంట్రవర్సీ పెట్టుకున్నారు. ఢీ కార్యక్రమానికి జడ్జిగా వచ్చిన ప్రభుదేవా జడ్జిమెంట్ ఇచ్చారు. రాకేశ్ మాస్టర్ కు అది నచ్చలేదు. దీంతో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు షోలకు తెలుగు కొరియోగ్రాఫర్లనే జడ్జిలుగా పిలవాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత ఇంటర్వ్యూలు, యూట్యూబ్ చానెళ్లలో చాలా మంది సెలబ్రిటీలపై విమర్శలు చేస్తూ వీడియోలు పెట్టాడు. దీంతో ఆయనకు ఇండస్ట్రీలో అవకాశాలు పూర్తిగా తగ్గాయి. సెలబ్రెటీ హోదా పోయింది.. ఆ తర్వాత మెల్లమెల్లగా ఆస్తులు కరిగిపోయాయి. తీవ్ర అనారోగ్యం పాలైన ఆయన అందరూ ఉన్న ఇంత పెద్ద రంగుల ప్రపంచానికి తెలిసినా అనాథలా తనువు చాలించారు. ఆయన జీవితం ఇండస్ట్రీలతో పాటు బయటి వ్యక్తులకు కూడా పాటమనే చెప్పవచ్చు.
ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి.. ఈ సత్యాన్ని రాకేశ్ మాస్టర్ మరిచారు. సెటబ్రెటీ హోదా రాగానే ఎగిరెగిరి పడ్డారు. ఎంతో మంది గొప్ప వ్యక్తులను ధూషించాడు. శిష్యులపై విరుచుకుపడ్డాడు. చివరికి ఒంటరిగా పోయాడు. ఆయన పేరు కూడా చాలా తొందరగానే ఇండస్ట్రీ మరిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.






