
Rakul Preeti Singh : రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. ఇండియా వైడ్ గా పాపులర్ అయ్యిన ఈ బ్యూటీ చాలా మంది ఫాలోవర్లను దక్కించుకుంది.. తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.. రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు వంటి వారితో మంచి మంచి సినిమాలు చేసిన ఈమె తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది..
అయితే తెలుగు ప్రేక్షకులు ఈ అమ్మడిని బాగా అభిమానిస్తున్న సమయంలోనే బాలీవుడ్ కు చెక్కేసింది.. వరుస హిట్స్ వస్తున్న సమయంలో రకుల్ బాలీవుడ్ కు వెళ్లడంతో ఇక్కడి ప్రజలు ఈమెపై గుర్రుగా ఉన్నారు. ఫేమ్ ఇచ్చిన టాలీవుడ్ ఇండస్ట్రీని వదిలి బాలీవుడ్ అంటూ వెళ్ళింది.. అక్కడ ఆఫర్స్ వస్తున్నాయని బాలీవుడ్ వెళ్లిపోవడంతో తెలుగు ప్రేక్షకులు, హీరోలు కూడా ఈమెను మర్చిపోయారు..
అయితే హిందీలో మాత్రం ఈమె స్టార్ డమ్ అందుకోలేక పోయింది. ఒకటి అరా అవకాశాలు అందుకున్న స్టార్ హీరోయిన్ గా ఎదిగలేక చతికల పడింది.. ముఖ్యంగా ఈ అమ్మడు డ్రగ్స్ కేసులో చిక్కుకోవడంతో ఈమె కెరీర్ దెబ్బతింది.. ఇక ఆ తర్వాత కొండపొలం సినిమాతో మళ్ళీ తెలుగు లోకి ఎంట్రీ ఇచ్చిన కూడా ప్లాప్ అందుకోవడంతో ఈమెకు మరో అవకాశం అనేది రాలేదు..
మరి అవకాశాలు లేకపోయినా రకుల్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ క్రేజ్ అయితే పోగొట్టుకోకుండా గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ కాలం గడుపుతుంది. తాజాగా సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అందాల జాతర చేసింది.. వైట్ డ్రెస్ లో ఈమె మత్తెక్కించే చూపులతో మాయ చేసింది.. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఆ పిక్స్ మీ కోసం.
View this post on Instagram