
Ram Charan : రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమా రెగ్యులర్ షూట్ అయితే స్టార్ట్ అయింది. ఈ సినిమాలో రామ్ చరణ్ గుడ్డివాడి పాత్రలో నటిస్తున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే నిజంగా అతనికి సినిమాలో కళ్ళు కనిపించవా లేదంటే కావాలనే గుడివాడి పాత్రలో నటిస్తున్నాడా? అనేది కూడా తెలియాల్సి ఉంది. మరి ఏది ఏమైనా కూడా ‘రంగస్థలం ‘ సినిమాలో చెవిటి వాడి పాత్రలో అదరగొట్టాడు. ఇక ఇప్పుడు కండ్లు లేనివాడిగా నటిస్తూ మెప్పించడానికి రామ్ చరణ్ తన స్వాయ శక్తుల ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక బుచ్చిబాబు లాంటి దర్శకుడు రామ్ చరణ్ ని భారీగా ఎలివేట్ చేసి చూపించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. మరి తను అనుకున్నట్టుగానే రామ్ చరణ్ ని భారీ రేంజ్ లో చూపిస్తాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…






