21.6 C
India
Wednesday, February 11, 2026
More

    The Indian House : పొలిటికల్ హీట్ ఎదుర్కొంటున్న రామ్ చరణ్.. ఆ సినిమాతోనే అంటూ కామెంట్లు..

    Date:

    the Indian house
    the Indian house

    The Indian house : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘V మెగా పిక్చర్స్’ బ్యానర్ స్థాపించడం, అందులో నిఖిల్ తో చిత్రాన్ని ‘ఇండియా హౌస్’ అనౌన్స్ చేయడం చాలా మందికి షాక్ ఇచ్చింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ బయటకు వచ్చినప్పటి నుంచి రామ్ చరణ్ పొలిటికల్ ఎఫైర్‌పై జనాలు మండిపడుతున్నారు.

    రామ్ చరణ్ నిఖిల్ హీరోగా తన సొంత బ్యానర్ లో సినిమాను అనౌన్స్ చేశాడు. దీనికి సంబంధించిన మోషన్ పోస్టర్ ను కూడా విడుదల చేశాడు. అయితే ఈ చిత్రం మహారాష్ట్ర కు చెందిన స్వాతంత్ర సమరయోధుడు వీర్ సావర్కర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతుంది. ఈ సినిమాపై బీజేపీ రామ్ చరణ్ కు మద్దతిస్తుండగా, కాంగ్రెస్, ఇతర విపక్ష పార్టీలు ఆయనపై ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. సావర్కర్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాను అనౌన్స్ చేయడం, అదే రోజు భారత కొత్త పార్లమెంటు కూడా ప్రారంభం కావడంతో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు భారీ విమర్శలను ఎదుర్కొంటున్నారు.

    మెగాస్టార్ చిరు చాలా కాలం క్రితమే బీజేపీ పెద్దలకు బాగా దగ్గరయ్యారని, ప్రధాని నరేంద్ర మోడీని వ్యక్తి గతంగా కూడా పలుమార్లు కలిశారని తెలిసిందే. ఇదే సమయంలో ఆర్ఆర్ఆర్ ఆస్కార్ విన్నర్ తర్వాత మోడీని కలిసేందుకు చరణ్ వెళ్లినప్పుడు చిరు కూడా ఆయన వెంటే ఉన్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ ఎప్పుడో బీజేపీకి దగ్గరయ్యారు. సావర్కర్ ను జాతీయ వ్యక్తిగా, స్వాతంత్య్ర పోరాటంలో కీలక వ్యక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రూపొందిన ఈ ప్రచార చిత్రాన్ని ఇప్పుడు చరణ్ కూడా మోడీతో చేతులు కలిపారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

    గాంధీ, నెహ్రూలతో పోలిస్తే సావర్కర్ అంత గొప్పవాడు కాదని చరిత్రకారుల అభిప్రాయం. ‘ది కాశ్మీర్ ఫైల్స్’ ఇన్వెస్టర్ అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రానికి కో ప్రొడ్యూసర్ కాబట్టి, ఈ మరాఠీ స్వాతంత్ర సమరయోధుడిని జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశంగా మార్చడానికి చరణ్ కూడా బీజేపీ మద్దతు ముఠాలో చేరాడని పలువురు భావిస్తున్నారు. అయితే ఈ సినిమాలోని కంటెంట్ గురించి ఎలాంటి క్లూ లేని సమయంలో ‘ది ఇండియా హౌస్’ను ప్రచార చిత్రం అనకూడదని కొందరు సినీ ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు. కేవలం ఫస్ట్ లుక్ మాత్రమే విడుదల చేశారని, సినిమా చూశాకనే ఏ నిర్ణయానికైనా రాగలమని అంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    jagan : ఆ ఓటర్లే టార్గెట్.. చంద్రబాబుకు చెక్ పెడుతున్న జగన్ 

    jagan ఎన్నికలకు 8 నెలల ముందుగానే ఏపీలో పొలిటికల్ హీట్ రోజురోజుకూ...