
ఉపాసన ప్రెగ్నెన్సీపై రాం చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అంతర్జాతీయ వేదిక జీ-20 సదస్సు సాక్షిగా రాం చరణ్ కొన్ని సీక్రెట్స్ బయటపెట్టాడు. రాం చరణ్-ఉపాసన దంపతుల ప్రెగ్నెన్సీపై కామెంట్స్ పదే పదే వైరల్ అవుతున్నాయి. ‘నాకు యూరప్ అంటే ఎంతో ఇష్టం. ఇప్పుడు జపాన్ దేశాన్ని అమితంగా ఇష్టపడుతున్నాను. జపాన్ దేశం, అక్కడి ప్రజలు, సంస్కృతి నాకు ఎంతో ఇష్టం. నా భార్య ఉపాసనకు ప్రస్తుతం 7వ నెల. నాకు పుట్టబోయే బిడ్డకు జపాన్ దేశంతో సంబంధం ఉంది’. అని షాకింగ్ కామెంట్ల చేశాడు రాం చరణ్. దాని గురించి కూడా వివరించాడు.
ఒక మ్యూజిక్ జపాన్ లో జరిగిందట. అందుకే జపాన్ అంటే తనకు చాలా అభిమానమని చెప్పారు రాం చరణ్. ప్రస్తుతం ఆయన కామెంట్లు వైరల్ గా మారాయి. గతేడాది ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని జపాన్ లో భారీగా విడుదల చేశారు. భారీ ఎత్తున ప్రమోషన్స్ నిర్వహించారు. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ సతీసమేతంగా జపాన్ వెళ్లింది. అక్కడ 2 వారాలకు పైగా ఉన్నారు.
ఆ సమయంలోనే ఉపాసన గర్భవతి అయ్యారని రాం చరణ్ చెప్పారు. ఇక ఉపాసన డెలివరీ అమెరికాలో ఉంటుందని ప్రచారం జరిగింది. ఈ వార్తలను ఖండించారు. ఇండియాలోనే అపోలో హాస్పిటల్స్ లో ఎక్కడైనా నాకు డెలివరీ కావచ్చని గతంలో ఉపాసన వెల్లడించారు.