Ram Charan’s daughter’s : మెగా కుటుంబంలో ఆనందం నెలకొంది. అందుకు కారణం ఏంటో అందరికి తెలుసు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, ఉపాసన దంపతులకు ఈ మధ్యనే కూతురు పుట్టింది. దీంతో ఈ జంట తల్లిదండ్రులుగా ప్రమోట్ అయ్యారు.. పెళ్లి అయ్యాక 11 ఏళ్లకు ఒక బిడ్డ పుట్టడంతో మెగా కుటుంబం కూడా ఎంతో ఆనందంగా ఉంది. ఆ ఆనందం మొత్తం చిరంజీవి కుటుంబం మొత్తంలో తెలుస్తుంది.
ఇక తాత అయిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఆనందం అంత ఇంత కాదు.. ఈయన మరింత ఉత్సాహంగా మారిపోయారు. మరి మెగా లిటిల్ ప్రిన్సెస్ రాకతో మెగా కుటుంబంలో ఆనందాలు వచ్చాయి.. అయితే ఈ రోజు ఉపాసన రామ్ చరణ్ దంపతుల కూతురు బారసాల వేడుక ఘనంగా జరిగింది.. మెగా లిటిల్ ప్రిన్సెస్ పేరు పెట్టే వేడుక ఈ రోజు గ్రాండ్ గా జరిగింది..
ఇదిలా ఉండగా రామ్ చరణ్ కూతురు పేరు గురించి సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా తెగ చర్చ జరుగుతుంది.. ఏం పేరు పెడతారా? ఎలాంటి పేరు పెడతారా? అని సోషల్ మీడియా వ్యాప్తంగా ఇంట్రెస్టింగ్ గాసిప్స్ ఎన్నో వచ్చాయి. మరి ఎట్టకేలకు మెగా లిటిల్ ప్రిన్సెస్ పేరు బయటకు వచ్చింది. రామ్ చరణ్ కూతురు పేరు.. క్లిన్ కారా కొణిదెల..
ఈ విషయాన్నీ స్వయంగా చిరు సోషల్ మీడియా వేదికగా చెబుతూ ఆ పేరు అర్ధం కూడా చెప్పుకొచ్చారు. లలితా సహస్రనామ నామం నుండి ఈ పేరును తీసుకున్నారు అని క్లిన్ కార అంటే ప్రకృతిని సూచిస్తుంది అని దివ్యమైన తల్లి శక్తి అని ఆ శక్తివంతమైన వైబ్రేషన్ ఈ పేరులో ఉంది అని చిరు చెప్పుకొచ్చారు. ఆమె పెరిగే కొద్దీ ఈ క్వాలిటీలన్నీ ఆమె వ్యక్తిత్వం లోకి వస్తాయని నమ్ముతున్నాం అంటూ చిరు చెప్పుకొచ్చారు.