Rangasthalam :
రాంచరణ్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా రంగస్థలం. ఇందులో రాంచరణ్ నటన అద్భుతంగా ఉంటుంది. అతడి నటనకు అందరు ఫిదా అయ్యారు. నిజంగా చెవిటి వాడి పాత్రలో చరణ్ అద్భుతంగా నటించాడు. దీంతో రంగస్థలం బ్రహ్మాండమైన విజయం సాధించింది. రంగస్థలం సినిమా అందరి అంచనాలను నిజం చేసింది. రాంచరణ్ లోని నటుడిని బయటకు తీసింది.
ఇక ఆర్ఆర్ఆర్ నటనకు గాను ఆస్కార్ అవార్డు అందుకున్నారు. ఇలా సినిమా ఎంపికలో రాంచరణ్ ది ప్రత్యేక వైఖరి. సంచలనాల దర్శకుడు శంకర్ తో తీస్తున్న గేమ్ చేంజర్ కూడా ఎన్నో రికార్డులు బ్రేక్ చేస్తుందని అంటున్నారు. రాంచరణ్ పాత్ర మలచిన తీరు అందరిని ఆకట్టుకుంటుంది. శంకర్ దర్శకత్వం గురించి అందరికి తెలిసిందే. అతడు తీసిన సినిమాలను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది.
రంగస్థలం జపాన్ భాషలోకి డబ్ చేసి విడుదల చేస్తున్నారు. కేజీఎఫ్ కూడా అక్కడ విడుదలవుతోంది. రెండు సినిమాలు అక్కడ ఎలాంటి ట్రెండ్ సృష్టిస్తున్నాయోనని అందరు ఎదురు చూస్తున్నారు. రాంచరణ్ కాస్త ఇప్పుడు పాన్ వరల్డ్ స్టార్ గా ఎదుగుతున్నాడు. ఇందులో భాగంగానే జపాన్ భాషలోకి డబ్ చేసే రంగస్థలంతో రాంచరణ్ అక్కడ కూడా మంచి ఫ్యాన్స్ ను సంపాదించుకుంటాడని చెబుతున్నారు.
ఆర్ఆర్ఆర్ తో పాన్ వరల్డ్ నటుడిగా మారిన రాంచరణ్ భవిష్యత్ లో ఇంకా మంచి సినిమాలు చేసేందుకు రె డీ గా ఉన్నాడు. రాంచరణ్ లో ఉన్న టాలెంట్ తో ఇంకా రికార్డులు బ్రేక్ చేసే సినిమాలు తీస్తారని అందరు ఆశిస్తున్నారు. అతడికి దర్శకులు కూడా అలాగే సహకరిస్తున్నారు. అందుకే రాబోయే సినిమాలు కూడా రాంచరణ్ ను మంచి పొజిషన్ కు తీసుకువెళ్తాయని ఆశిద్దాం.