Ram Lalla Prana Pratishtha in SDP SSV Temple: జగదబి రాముడు, లోకాభిరాముడు కొలువు దీరుతున్న వేళ యావత్ ప్రపంచం అయోధ్య వైపునకు దృష్టి పెట్టింది. రామ రాజ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీరాముడు పట్టాభిషక్తుడై కొలువు దీరిన దర్వాత ముల్లోకాలు హర్షించాయి. సర్వమత సమానత్వం, సౌబ్రాతృత్వం వెల్లివిరిసింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే రామ నామం చాలు లోకాలను సుఖ శాంతులతో ఉంచేందుకు. అలాంటి రాముడికి అయోధ్యలో ఇప్పుడు ప్రాణ ప్రతిష్ట జరుగుతంది.
ఈ వేడుకలు తిలకించేందుకు ముల్లోకాలు వేయి కన్నులతో ఆనందంలో ముగిని తేలుతున్నాయి. రామయ్యను ఎప్పుడు కొలుద్దామా అని భక్తులు సైతం ఆనంద భాష్పాలతో ఎదురు చూస్తున్నారు. అమెరికా న్యూ జెర్సీలోని సాయి దత్త పీఠం ఆధ్వర్యంలో కొనసాగే శ్రీ శివ విష్ణు దేవాలయంలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించి వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నారు.
రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా శ్రీ శివ విష్ణు దేవాలయంలో రామనామ జపంను వైభవంగా నిర్వహిస్తున్నారు. జనవరి 21 (ఆదివారం)వ తేదీ నుంచి జనవరి 22 (ఆదివారం) వరకు చిన్నారులు వారి తల్లిదండ్రులతో శ్రీరామ భజనలు (రామ రక్షా స్త్రోత్రం మరియు హనుమాన్ చాలిసా) బాల రామాయణం, రామనామ జపం (శ్రీ రామ జయ రామ జయ జయ రామ) చేస్తున్నారు. ఈ సందర్భంగా అయోధ్య నుంచి వచ్చిన అక్షితలను ఈ భజనలు పూజల్లో పాల్గొన్న చిన్నారులకు, వారి తల్లిదండ్రులకు పంపిణీ చేశారు. అయోధ్యలో రాముడు కొలువు దీరుతున్న వేళ భారత్ ప్రపంచానికే విశ్వ గురువుగా మారుతుందని ప్రముఖులు అన్నారు.
More Photos : Ayodhya Ram Mandir Prana Pratishta Mahotsav at SDP SSV Temple
All Images Courtesy by Dr. Shiva Kumar Anand