Ram Lalla Pratishtapana : అయోధ్య పురంలోని రామ మందిరంలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్టకు ఇంకా గంటల సమయం మాత్రమే ఉంది. ఈ మహోత్తర ఘట్టానికి దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి అనేక మంది అయోధ్యపురం చేరుకోనున్నారు. ఈ ఉత్సవాలకు దేశం యావత్తు ప్రతీ ఒక్కరికీ ఆహ్వాన పత్రిక పంపించింది శ్రీ రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్. కానీ అందరూ వస్తే అయోధ్యలో గందర గోళ పరిస్థితి నెలకొంటుందని భావించి 22న ప్రముఖులను మాత్రమే దర్శనం కల్పించనుంది.
అయితే ఉత్సవాలను సిల్వర్ స్క్రీన్ పై చూసేలా ఏర్పాట్లు చేస్తున్నాయి మల్టీప్లెక్స్ సంస్థలు, పీవీఆర్, ఐనాక్స్ లాంటి దిగ్గజ సంస్థలు భక్తులకు ఈ అవకాశం కల్పించనున్నాయి. ఈ మహోన్నత ఘట్టాన్ని టీవీల్లో చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. సిల్వర్ స్ర్కీన్‌పై కేవలం రూ. 100 టికెట్‌తోనే ఉత్సవాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దేశంలోని 70 ప్రధాన నగరాలు, 170 కంటే ఎక్కువ కేంద్రాల్లో రాముడి పండగను ప్రత్యక్ష ప్రసారం కల్పించనున్నారు. పీవీఆర్, ఐనాక్స్ ఈ ఏర్పాట్లను చేస్తున్నాయి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వెండితెరపై చూసే అవకాశం కల్పించింది. టికెట్ ధర రూ. 100 మాత్రమే నిర్ణయించారు. ఈ ధరలోనే కూల్ డ్రింక్స్, పాప్ కార్న్ కాంబో వంటివి కూడా అందించనున్నారు.
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వంటి ప్రముఖులు అయోధ్య వేడుకల్లో పాల్గొంటున్నారు. వీరితో పాటు సీని ప్రముఖులు అమితాబ్ బచ్చన్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ దంపతులు, ప్రభాస్, రణబీర్ కపూర్, మోహన్ బాబు, రిషబ్ శెట్టి, యష్, అలియా భట్, కంగనా రనౌత్ వెళ్లనున్నారు.
రాముడి ఉత్సవాన్ని చూడాలని ప్రతీ భారతీయుడు కోరుకుంటాడు. వారి కోరిక మేరకు ఈ అవకాశాలను కల్పించనుంది. గతంలో సినీ ఉత్సవాలతో పాటు క్రికెట్ కూడా లైవ్ టెలీకాస్ట్ చేశాం. ఇలాంటి మహోత్తరమైన ఘట్టం టెలీకాస్ట్ చేయడం అదృష్టంగా భావిస్తున్నామని పీవీఆర్ ఐనాక్స్ కోసీఈవో గౌతం దత్తా అన్నారు. ఆయా మల్టీప్లెక్స్‌ల అధికారిక వెబ్ సైట్లలో, ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ బుక్ మై షోలో అయోధ్య రాముడి ఉత్సవ టికెట్లను బుక్ చేసుకోవచ్చు.