
1980 దశకం చివరలో వచ్చిన ఐకానిక్ టెటీ సీరియల్ ‘రామాయణం’ మళ్లీ టెలికాస్ట్ కాబోతోంది. సూపర్ హిట్ షో ‘రామాయణ్’ ప్రోమోషన్ సుమారూ టీవీ ఇన్ స్టాలో షేర్ చేసింది. ‘ప్రపంచ ప్రఖ్యాత పౌరాణిక సీరియల్ రామాయణ్‌ను మీ అందరి ముందుకు మళ్లీ తీసుకువస్తున్నాం’ అంటూ కాప్షన్ పెట్టింది. జూలై 3వ తేదీ నుంచి రాత్రి 7.30 గంటలకు ‘రామాయణ్’ను షెమారు టీవీలో చూడవచ్చని తెలిపింది.
జులై 3వ తేదీ రాత్రి 7.30 గంటలకు షెమారూ టీవీ ఛానెల్ లో ఈ పౌరాణిక షో ప్రసారం కానుంది. రామానంద్ సాగర్ దర్శకత్వం వహించిన ‘రామాయణం’ 1980వ దశకం చివర్లో పాపులర్ సీరియల్. ఈ ధారావాహికలో రాముడిగా అరుణ్ గోవిల్, సీతగా దీపికా చిఖాలియా, లక్ష్మణుడిగా సునీల్ లాహ్రీ నటించారు. హనుమంతుడిగా దివంగత ధారాసింగ్, రావణుడిగా అరవింద్ త్రివేది నటించారు. 25 జనవరి, 1987 నుంచి 31 జూలై, 1988 వరకు ప్రసారమైన ఈ షోకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.
సోషల్ మీడియాలో ఇటీవల విడుదలైన ఓం రౌత్ పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’తో పోలుస్తున్న సమయంలో ఈ షో తిరిగి టీవీ తెరపైకి వస్తుందని ప్రకటన రావడం గమనార్హం. మేకర్స్ ‘రామాయణ్’ ప్రోమోను విడుదల చేసిన వెంటనే అభిమానులు కామెంట్ సెక్షన్ను రెడ్ హార్ట్ ఎమోటికాన్స్తో నింపేశారు.
ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో చాలా మంది చిన్న తనంలో ఇష్టంగా చూసే సీరియల్ రామాయణ్. అప్పట్లో దూర్ దర్శన్ లో ఆదివారం మాత్రమే ఇది ప్రసారం అయ్యేది. చాలా మంది ఇంట్లో టీవీలు ఉండకపోవడంతో వీధుల్లో ఉండే టీవీల వద్దకు వెళ్లి అక్కడ కూర్చుని చూసేవారు. కానీ ఇప్పుడు టీవీ లేని ఇల్లు లేదు. ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఈ సీరియల్ చూస్తామని చాలా మంది ఇన్ స్టా కామెంట్లు పెడుతున్నారు.