
Ramaprabha : వెటరన్ నటుడు శరత్ బాబు నిన్న అనారోగ్యంతో కన్నుమూశారు.. ఈయన 71 సంవత్సరాల వయసులో పలు అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో రెండు మాసాల పాటు పోరాడి తుది శ్వాస విడిచారు. దీంతో టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. ఈయన తన కెరీర్ లో 250 చిత్రాల్లో నటించారు.. సీతాకోక చిలుక, సంసారం ఒక చదరంగం, అన్నయ్య, మూడుముళ్ల బంధం, ఆపద్బాంధవుడు వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందారు.
శరత్ బాబు 5 దశాబ్దాలుగా సౌత్ లోని అన్ని భాషలతో పాటు హిందీలో కూడా పలు సినిమాలు చేసి మెప్పించారు. మరి అలాంటి స్టార్ మరణించడంతో ఇండస్ట్రీ మొత్తం శరత్ బాబుకు సంతాపం తెలిపారు.. చిరంజీవి, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ వంటి ఎందరో స్టార్స్ సోషల్ మీడియా వేదికగా ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు.
ఇక శరత్ బాబు మృతి పట్ల ఆయన మాజీ భార్య రమా ప్రభ కూడా విచారం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. నిన్న చెన్నై లోని శరత్ బాబు నివాసానికి వెళ్లి ఆయన పార్థివ దేహానికి సంతాపం తెలిపి కన్నీళ్లు పెట్టుకున్నట్టు తెలుస్తుంది.. 1974లో వీరు ప్రేమించి పెళ్లి చేసుకుని 14 ఏళ్ళ పాటు కాపురం చేసి ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు..
కాపురంలో తలెత్తిన మనస్పర్థల కారణంగా వీరు విడాకులు తీసుకోవాల్సి వచ్చింది.. విడిపోయిన తర్వాత ఎవరి లైఫ్ లో వారు బిజీ అయిన రమా ప్రభ మాత్రం మరో పెళ్లి చేసుకోలేదు.. శరత్ బాబు రెండవ పెళ్లి చేసుకున్న అది కూడా నిలవలేదు.. ఇక ఈయనకు రెండవ పెళ్ళిలో ఒక కొడుకు, కూతురు ఉన్నారు.. ఈయన చివరిసారిగా వకీల్ సాబ్ లో కనిపించగా మళ్ళీ పెళ్లి సినిమాలో నటించి మరణించారు..