
గోపీచంద్ కు ఇప్పటికిప్పుడు ఒక బాక్సాఫీస్ హిట్ కావాలి. ఆయన సినిమాలు వరుస ప్లాపులుగా నిలుస్తున్నాయి. వీటి నుంచి బయటపడేందుకు పాత డైరెక్టర్ శ్రీవాస్ తో ఒక సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు గోపీచంద్. అదే ‘రామబాణం’. దీంతో వారు హిట్ కొట్టారా..? వారి ఆశలు ఫలించాయా..? చూద్దాం. శుక్రవారం (మే 5) రోజున సినిమా రిలీజ్ కాగా. యూఎస్ లో ప్రీమియర్ షో వేశారు. ట్విటర్ టాక్ గురించి తెలుసుకుందాం. అయితే ఈ సినిమా కంటెంట్ చాలా ఓల్డ్ టైప్ అంటున్నారు ప్రేక్షకులు. ఔట్ డేటెడ్ కథతో ఇప్పటి వారిని మెప్పించడం కష్టం అంటున్నారు.
కథ : జగపతి బాబుది ఉమ్మడి కుటుంబం. సంప్రదాయాలు, విలువలకు కట్టుబడి ఉంటారు. తమ చుట్టూ ఉండేవారు కూడా బాగుండాలని కుటుంబంలోని అందరూ కోరుకుంటారు. ఇలా ఆనందంగా జీవిస్తున్న వీరి కుటుంబాన్ని ఒకడు ఇబ్బంది పడుతుంటాడు. దీంతో వాడికి ఎదురుగా మన హీరో వెళ్తాడు. చివరికి ఏమవుతుందనేదే కథ. ఇది ఒకప్పటి హిట్ ఫార్ములా. ఇలాంటి చిత్రాలు చాలా వరకు ఇప్పటికే ఉన్నాయి. ఇక శ్రీవాస్ మొదటి సినిమా ‘లక్ష్యం’ కూడా ఇలానే ఉంటుంది. ఇందులో విలన్ హీరో అన్నయ్యను చంపుతాడు. ఇక హీరో విలన్ పై పగతీర్చుకుంటాడు.
విశ్లేషణ: ఒకప్పటి ఓల్డ్ ఫార్ములాతోనే ఈ చిత్రాన్ని కూడా తెరకెక్కించారు శ్రీవాస్. ఇది ఏ మాత్రం ఆకట్టుకోవడం లేదని ట్విటర్ ద్వారా టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాకు నెగెటివ్ రివ్యూలు వస్తున్నాయి. ఈ సినిమాను ఔట్ డేటెడ్ మాస్ కమర్షియల్ మూవీగా అభివర్ణిస్తున్నారు యూఎస్ తెలుగు ప్రేక్షకులు. ఎమోషన్, పాట, ఫైటు, కొంచెం కామెడీ మరికొంచెం రొమాన్స్ ఇందులో ఇది తప్ప ఏం లేదని చెప్తున్నారు.
ఫస్ట్ హాఫ్ అంతా వెన్నెల కిశోర్, అలీ, సప్తగిరి, శ్రీనుతో లాగించేశారు. అక్కడక్కడా హీరోయిన్ డింపుల్ హయతీతో రొమాన్స్ సీన్స్ వేశారు. ఇందులో కామెడీ కూడా అంతగా వర్కవుట్ కాలేదు. వాటి కోసం సినిమాకు వెళ్లిన ప్రేక్షకులకు కూడా నిరాశే ఎదురైంది. ఇక కథపై ఎలాంటి ఆసక్తి కనిపించలేదు. యాక్షన్ సన్నివేశాలు కొంత మేర బాగానే ఉన్నా. హీరోయిన్ గ్లామర్ కుర్రకారును ఆకర్షిస్తుందనే చెప్పవచ్చు. ఏది ఏమైనా ట్విటర్ టాక్ లో గోపీచంద్ కు నిరాశ తప్పదనిపిస్తుంది. అయితే పూర్తి స్థాయి రివ్యూ రావాలంటే శనివారం వరకు ఆగాల్సిందే.






