29.6 C
India
Friday, May 16, 2025
More

    Rambha Daughter Lanya : కూతురు లాణ్య గ్రాడ్యేయేషన్ డేలో రంభ సందడి..!

    Date:

    • కూతురికి ముద్దుపెడుతూ సంతోషిస్తున్న నటి
    Rambha Daughter Lanya
    Rambha Daughter Lanya

    Rambha Daughter Lanya : తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాలు తీసి స్టార్ డమ్ సంపాదించుకున్న నటి రంభ. విజయవాడలో 5 జూన్, 1976లో విజయలక్ష్మిగా జన్మించింది. దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ ఆమెను తెరంగేట్రం చేయించాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘ఆ ఒక్కటి అడక్కు’ సనిమా ఆమె చేసిన ఫస్ట్ మూవీ. ఆ తర్వాత ఆమె చాలా సినిమాలు చేసింది. ముఖ్యంగా జేడీ చక్రవర్తి-రంభ హిట్ పెయిర్ గా నిలిచారు.

    జేడీతోనే కాకుండా చాలా మంది స్టార్ హీరోలతో సినిమాలు చేశారు రంభ. చిరంజీవి, వెంకటేశ్, బాలకృష్ణ, మోహన్ బాబు, ఇలా అప్పట్లో రంభ డేట్స్ దొరకాలంటే వెయిట్ చేయాల్సిందే. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా చాలా సినిమాలు చేసింది రంభ. జేడీ చక్రవర్తిని పెళ్లి చేసుకోబోతోందని అనే న్యూస్ అప్పట్లో బాగా వైరల్ గా మారింది. అయితే అవేవీ నిజం కాదని ఇద్దరూ కూడా కొట్టి పారేశారు. ఈ నేపథ్యంలో ఆమె కెనడాకు చెందిన ఓ బడా వ్యాపారవేత్త ఇంద్రన్ పద్మనాథన్ ను పెళ్లి చేసుకుంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు.

    రంభ చాలా కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. భర్త, పిల్లలతో సంతోషంగా గడుపుతున్నారు ఆమె. రంభ పెద్ద కూతురు పేరు లాణ్య. చూసేందుకు అచ్చు రంభలాగే ఉంటుంది. ఇటీవల ఆమె గ్రాడ్యుయేషన్ కూడా అయిపోయిందట. కాలేజ్ లో ఈ వేడుకలకు తల్లీతండ్రులతో కలిసి లాణ్య దిగిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి. రంభకు చెల్లిలాగా కనిపిస్తున్న లాణ్య గ్రాడ్యుయేషన్ పూర్తయింది. ఇక ఆమెను సినిమాల్లోకి తీసుకురావాలని కొందరు కోరుతున్నారట. దీనిపై ఇప్పటి వరకు రంభ స్పందించలేదు. రంభ తన కూతురును కూడా సినిమాల్లోకి తసుకువస్తుందా వేచి చూడాలి మరి.

     

    View this post on Instagram

     

    A post shared by Rambha💕 (@rambhaindran_)

    Share post:

    More like this
    Related

    Apple products : భారత్‌లో ఆపిల్ ఉత్పత్తుల తయారీ వద్దు: టిమ్ కుక్‌తో డొనాల్డ్ ట్రంప్

    Apple products : ఇదిలా ఉండగా, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్...

    Bellamkonda Srinivas : హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై జూబ్లీహిల్స్‌ పీఎస్‌లో కేసు నమోదు

    Bellamkonda Srinivas : హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో కేసు...

    Balakrishna : బాలకృష్ణ నా పై సీరియస్ అయ్యాడు

    Balakrishna : హీరోయిన్ లయ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ,...

    Saraswati Pushkaram : నేటి నుంచి కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు షురూ

    వేకువ జామున లాంఛనంగా ప్రారంభం - సాయంత్రం సీఎం దంపతులు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related