
Ramcharan Daughter : కూతురి రాకతో రాంచరణ్-ఉపాసనల ఆనందం రెట్టింపయ్యింది. ఈ జంట జూన్ 23న హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్స్ వెలుపల తమ కుమార్తెతో కలిసి బహిరంగంగా కనిపించారు. ఈ జంట తమ ఆడబిడ్డతో దిగిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా రాంచరణ్ విలేకరుల సమావేశంలో మీడియాతో మాట్లాడాడు. మీ కుమార్తె ఎవరిలా ఉందో సమాధానం చెప్పాలని విలేకరులు కోరగా రామ్ చరణ్ నవ్వుతూ చెప్పిన సమాధానం అందరినీ ఆకట్టుకుంది..
రామ్ చరణ్ – ఉపాసన వివాహం అయిన 11 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా వీరికి కూతురు జన్మించింది. జూన్ 20న హైదరాబాద్‌లో ఆడబిడ్డకు ఉపాసన జన్మనిచ్చింది.
ఆడపిల్లకు జన్మనిచ్చిన మూడు రోజుల తర్వాత, రామ్ చరణ్ – ఉపాసన తమ కుమార్తెను తీసుకొని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత ఇంటికి తీసుకెళ్లారు. మీడియా ముందు ఫ్యామిలీ మొత్తం కనిపించింది. మొదటిసారి తండ్రి కావడం గురించి మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు. ఒక రిపోర్టర్ మీ కూతురు ఎవరిలా ఉంది అని అడగ్గా రామ్ చరణ్ చాలా సరదాగా సమాధానం ఇచ్చాడు. ‘నా కూతురు కచ్చితంగా నాలాగే ఉంటుంది’ అంటూ నవ్వేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చాలా మంది అతని కామెడీ టైమింగ్‌ను ప్రశంసించారు.
Love You Annayya @AlwaysRamCharan 🥹❤️
“కచ్చితంగా నాన్న లాగే ఉంది” 😂😂#RamCharan #MegaPrincess pic.twitter.com/oL1ar1k1pC
— Hemanth RC ™ (@Hemanth_RcCult) June 23, 2023
మీడియా సమావేశంలో చరణ్ మాట్లాడుతూ.. ‘మీడియాకు, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు నా కృతజ్ఞతలు. నాన్న చెప్పినట్లే జూన్ 20న నా కూతురు పుట్టింది. ఉపాసన కోలుకుంది. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. వైద్యులకు నా ధన్యవాదాలు. సిబ్బంది మమ్మల్ని జాగ్రత్తగా చూసుకున్నందుకు మేము చాలా అదృష్టవంతులం. ఎటువంటి సమస్యలు లేకుండా, ఇద్దరూ చాలా బాగా ఉన్నారు. మీ ప్రార్థనలు ఎప్పటికీ మరువలేము. అన్ని దేశాల నుండి మాకు లభించిన ఆశీర్వాదాలు నాకు కృతజ్ఞతా భావాన్ని కలిగించాయి. చాలా ధన్యవాదాలు.” అంటూ మీడియా ముందు మాట్లాడారు.
ఉపాసన – కుమార్తెతో ఉండటానికి రామ్ చరణ్ మూడు నెలల విరామం తీసుకున్నట్లు చెబుతున్నారు. అతను త్వరలో శంకర్ గేమ్ ఛేంజర్ షూటింగ్‌ను తిరిగి ప్రారంభించనున్నాడు.
Here’s the Glimpses of our 𝐆𝐋𝐎𝐁𝐀𝐋 𝐒𝐓𝐀𝐑 @AlwaysRamCharan garu & @upasanakonidela garu along with #MegaPrincess ✨🤗 at Apollo Hospital Hyderabad Today!#GlobalStarRamCharan #UpasanaKonidela #RamCharan #GameChanger pic.twitter.com/pFE9vMIB9T
— RC YuvaShakthi (@RcYuvaShakthi) June 23, 2023