39.4 C
India
Saturday, June 6, 2026
More

    Ramoji Rao : ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు అస్తమయం

    Date:

    Ramoji Rao
    Ramoji Rao

    Ramoji Rao : ఈనాడు మీడియా సంస్థల అధినేత, మీడియా మొఘల్ రామోజీరావు (88) కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. జూన్ 5న ఆయనకు శ్వాస తీసుకోవడంతో ఇబ్బందులు ఎదురవడంతో కుటుంబ సభ్యులు నానక్ రామ్ గూడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. రామోజీరావును పరీక్షించిన వైద్యులు గుండె సంబంధిత సమస్య ఉన్నట్లు గుర్తించి స్టంట్ అమర్చారు. రెండు రోజులుగా ఐసీయూలో ఉన్న ఆయన ఆరోగ్యం శుక్రవారం రాత్రి విషమించింది. శనివారం తెల్లవారు జామున 4.50 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. ఫిల్మ్ సిటీలోని నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలించనున్నారు.

    1936 నవంబర్ 16నన కృష్ణా జిల్లా పెదపారుపూడిలో చెరుకూరి వెంకటసుబ్బారావు, సుబ్బమ్మ దంపతులకు రామోజీరావు జన్మించారు. అక్కలు రాజ్యలక్ష్మి, రంగనాయకమ్మ తర్వాత ఆయన జన్మించారు. చిన్నప్పటి నుంచే విలక్షణ, సృజనాత్మకత ఉన్న వ్యక్తి ఆయన. ఈనాడు దినపత్రికను ప్రారంభించి తెలుగునాట సంచలనం సృష్టించారు. 1974 ఆగస్టు 10న విశాఖ సాగర తీరంలో ‘ఈనాడు’ను ప్రారంభించారు. నాలుగేళ్లలోనే పాఠకుల మానసపుత్రికగా ఈనాడు మారింది. ఈనాడుతో పాటు కీలక మైలురాయిగా ‘సితార’ సినీ పత్రిక నిలిచింది.

    బహుముఖ ప్రజ్ఞ, కఠోర సాధన, ఇవే రామోజీరావు అస్త్రాలు. నలుగురు నడిచిన బాట కాదు.. కొత్త దారులు సృష్టించడం ఆయన నైజం. లక్ష్య సాధనకు దశాబ్దాల పాటు నిర్విరామంగా పరిశ్రమించిన యోధుడు. రైతుబిడ్డగా మొదలై వ్యాపారవేత్తగా రాణించారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ramoji Groups : రామోజీ గ్రూప్స్ లో ఎవరి బాధ్యతలు ఏంటి?

    Ramoji Groups : మీడియా మొఘల్, గ్రేట్ ప్రొడ్యూసర్ రామోజీరావు మరణించి...

    Sakshi – Chiranjeevi : చిరంజీవి బాగానే ఉన్నారు.. సాక్షికి ఎందుకు ఆ ప్రాబ్లామ్? 

    Sakshi - Chiranjeevi : మీడియా మొఘల్ రామోజీరావుకు ఆంధ్రప్రదేశ్...

    Ramoji Rao : రామోజీరావు సంస్మరణ సభను భారీగా నిర్వహిస్తున్న ఏపీ ప్రభుత్వం

    Ramoji Rao : మీడియా మొఘల్  రామోజీరావు గురించి ఎంత చెప్పుకున్నా...

    Ramoji Rao : రామోజీరావు మృతి సినీ రంగానికి తీరని లోటు..ఆయన నటించిన సినిమా తెలుసా..

    Ramoji Rao : రామోజీరావు తెలుగు అక్షర కృషీ వలుడు.. ఈనాడు...